‘బాలీవుడ్’ ఎంట్రీ పై బాంబ్ పేల్చిన ప్రిన్స్!!!

ఎన్నో ఆశలతో ఉన్న ప్రిన్స్ అభిమానులకు మహేష్ బాబు షాక్ ఇచ్చాడు. ఎవ్వరూ ఊహించని విధంగా ఆ విషయాన్ని కాదని చెప్పేసాడు. ఇంతకీ ఏంటి ఆ విషయం?? అభిమానులు ఎందుకు షాక్ అయ్యారు అంటే ఈ కధ చదవాల్సిందే..విషయంలోకి వెళితే ప్రిన్స్ మహేష్ బాబుకు టాలీవుడ్ లోనే కాను, అటు బాలీవుడ్ లో కూడా భీబత్సం అయిన ఫ్యాన్స్ ఉన్నారు. అంతేకాకుండా ప్రిన్స్ ఎప్పుడెప్పుడు బాలీవుడ్ లో అడుగుపెడతాడా అన్న ఆశలు సైతం అభిమానుల్లో ఎక్కువగానే ఉన్నాయి. ఇక ఈ మధ్య పవర్ స్టార్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడంతో ప్రిన్స్ అభిమానులకు ఇది ఇజ్జత్ కా సవాల్ గా మారింది. అయితే ఇదే క్రమంలో ఈ విషయంపై ప్రిన్స్ క్ల్యారిటీ ఇచ్చేశాడు. ప్రిక్‌నె తాజా చిత్రం “బ్రహ్మోత్సవం” ప్రమోషన్ లో భాగంగా మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, బాలీవుడ్ లో ఓవెర్సీస్ లో నాకు అభిమానులు, క్రేజ్ ఎక్కువగా ఉంది కదా అని అక్కడకు వెళ్ళి, ఇతర బాషల్లో సినిమాలు చెయ్యడం నాకు ఇష్టం లేదు.

నాగు తెలుగు చిత్ర పరిశ్రమ చాలా చేసింది. వేరే బాషల్లో సినిమాలు చెయ్యాలంటే మరింత సమయాన్ని వాటికి కేటాయించాలి. అదే సమయంలో ఇక్కడ ఇంకో తెలుగు సినిమా చేసుకోవడం బెట్టర్. అంతేకాకుండా తాను ఎప్పటికీ తెలుగు సినిమా పరిశ్రమలోనే ఉంటాను అని తేల్చి చెప్పేసాడు. అదే క్రమంలో రీమేక్ సినిమాల విషయంపై కూడా ప్రిన్స్ క్లారిటీ ఇచ్చేశాడు. రీమేక్ సినిమాలు చెయ్యాల్సిన అవసరం లేదు అని, తెలుగు రచయితలు మంచి కధలు తెస్తున్నారు అని, వారికి ప్రోత్సహిస్తే సరిపోతుంది అని తేల్చి చెప్పేసాడు. ఏది ఏమైనా..ప్రిన్స్ అనే ఒక హీరో మన తెలుగోడుగా పుట్టడం మనకు గర్వకారణం అని చెప్పక తప్పదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus