Mahesh Babu, Rajamouli: ఎనిమిది లుక్స్‌? రాజమౌళితో సినిమాపై మహేశ్‌ అప్‌డేట్‌ ఇదిగో!

కొన్ని విషయాలు చెప్పకుండా దాస్తే… జనాలు మరచిపోతారు. మరికొన్ని విషయాలు చెప్పకుండా ఆపితే… ఉత్సుకత పెరిగిపోతుంది. అలాంటి వాటిలో మహేష్‌బాబు – రాజమౌళి సినిమా ఒకటి. #SSMB29 అంటూ చాలా రోజులుగా ఈ సినిమా గురించి సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. త్వరలో ప్రారంభం అంటున్నారు తప్ప ఇంకే సమాచారం లేదు. అయితే ఇటీవల కాలంలో సినిమా గురించి కొన్ని విషయాలు బయటికొస్తున్నాయి. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజమౌళి దగ్గర ఈ సినిమా గురించి ప్రస్తావిస్తే… ‘‘అవును మహేశ్‌తో సినిమా తీస్తున్నా.

త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం అవుతుంది. ఇంకా ఈ సినిమా టైటిల్‌ ఖరారు కాలేదు’’ అని చెప్పారు. మహేశ్‌బాబు ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఈ సినిమా గురించి మాట్లాడాడు. ‘‘రాజమౌళి సర్‌తో చేయబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే మా ప్రయాణం మొదలవుతుంది. ఆ రోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని అన్నాడు. వాళ్లిద్దరూ అలా చెప్పినా సోషల్ మీడియాలో మరో వార్త బయటికొచ్చింది. ఈ సినిమా కోసం మహేష్‌బాబుకు లుక్‌ టెస్ట్ జరిగిందనేది ఆ వార్తల సారాంశం.

మహేష్‌ కోసం ఎనిమిది లుక్స్‌ రెడీ అయ్యాయా? అని చర్చించుకుంటున్నారు. ఇప్పటివరకూ స్క్రీన్‌పై కనిపించని కొత్త లుక్‌లో మహేశ్‌ కనిపిస్తారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. గడ్డం పెంచి, పొడవాటి జుట్టుతో ఈ సినిమాలో కనిపించనున్నాడని టాక్‌. మొత్తంగా దీని కోసం ఎనిమిది లుక్స్‌ రెడీ చేశారట. ఇటీవల స్కెచ్‌లు పూర్తయ్యాయట. అందులో ఏది ఫైనల్‌ అవుతుందో చూడాలి. ఇక ఈ భారీ సినిమాకు ‘మహారాజ్‌’ అనే పేరు అనుకుంటున్నారట.

సినిమాలో మహేష్‌ (Mahesh Babu) పాత్రలకు తగ్గ పేరు ఇదే అవుతుంది అని అంటున్నారు. అయితే పాన్‌ వరల్డ్‌ సినిమా అంటున్నారు కాబట్టి… ఇంకేదైనా షార్ట్‌ నేమ్‌ పెడతారు అని టాక్‌ నడుస్తోంది. వినడానికి, చదవడానికి క్యాచీగా ఉండేలా చూసుకుంటున్నారని టాక్‌. ఇక ఉగాది నాడు ఈ సినిమాకు కొబ్బరికాయ కొడతారు అనే టాక్‌ కూడా నడుస్తోంది.

‘సలార్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?!

నయన్ విఘ్నేష్ మధ్య విబేధాలకు అదే కారణమా.. అసలేమైందంటే?
నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. వరుడి బ్యాగ్రౌండ్ ఇదే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus