ఈ ఏడాది సంక్రాంతి సినిమాలతో ఇద్దరు టాలీవుడ్ టాప్ హీరోలు బ్లాక్ బస్టర్స్ నమోదు చేశారు. ఒక రోజు వ్యవధిలో విడుదలైన సంక్రాంతి సినిమాలు అల వైకుంఠపురంలో , సరిలేరు నీకెవ్వరు వసూళ్ల వరద పారించాయి. రెండు చిత్రాలు 100కోట్లకు పైగా వరల్డ్ వైడ్ షేర్ సాధించి ఇద్దరికి కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రాలుగా నిలిచాయి. అలాగే ఈ రెండు చిత్రాలు ఒక విషయంలో సమాన రికార్డు సొంతం చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఒకటి కోటికి పైగా షేర్ వసూళ్లు సాధించిన టౌన్స్ నందు రెండు సమానంగా 15 టౌన్స్ లో నమోదు చేశాయి. అల వైకుంఠపురంలో ఆంధ్రప్రదేశ్ లో 15 టౌన్ ఏరియాల్లో 1 కోటికి పైగా షేర్ వసూలు చేయగా, సరిలేరు నీకెవ్వరు కూడా 15 టౌన్స్ నందు 1 కోటి షేర్ వసూలు చేసింది.
ఈజాబితాలో బాహుబలి 2, మొత్తం 23 టౌన్స్ నందు 1 కోటికి పైగా షేర్ సాధించి ఆల్ టైం టాప్ గా ఉంది. దీని తరువాత అల వైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరు 15 టౌన్స్ తో సెకండ్ ప్లేస్ లో ఉన్నాయి. ఇక బాహుబలి చిత్రం 14 టౌన్స్ లో ఒక కోటికి పైగా షేర్ సాధించి మూడవ స్థానంలో ఉంది. 13 టౌన్స్ నందు ఈ ఫీట్ సాధించి రంగస్థలం నాలుగవ స్థానంలో, 9టౌన్స్ లో ఒక కోటి షేర్ వసూలు చేసి ఐదవ స్థానంలో సైరా నరసింహారెడ్డి కొనసాగుతున్నాయి. ఈ చిత్రాలు అత్యధిక టౌన్స్ నందు ఒక కోటికి పైగా షేర్ వసూలు చేసిన జాబితాలో ఉన్నాయి. మొత్తం ఆరు సినిమాలలో మూడు మెగా హీరోలవి కావడం విశేషం. ఈ లిస్ట్ లో ప్రభాస్, మహేష్ మాత్రమే ఇతర హీరోలు.
డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!