Balakrishna: బాలయ్యను మహేష్, చరణ్ ఫాలో అవుతున్నారా?

ఈ మధ్య కాలంలో డ్యూయల్ రోల్ కథాంశాలతో తెరకెక్కిన సినిమాలలో బాలయ్య ఎక్కువగా నటిస్తున్నారు. బాలయ్య డ్యూయల్ రోల్ లో నటించిన సింహా, అఖండ, లెజెండ్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను సొంతం చేసుకున్నాయి. ఈ సినిమాలు అటు బాలయ్యకు ఇటు బోయపాటి శ్రీనుకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. బాలయ్య తర్వాత ప్రాజెక్ట్ లో కూడా డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. బాలయ్య గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో నటిస్తున్నారు.

అయితే మహేష్, చరణ్, రవితేజ కూడా తమ భవిష్యత్తు ప్రాజెక్ట్ లలో డ్యూయల్ రోల్ లో నటిస్తుండటం గమనార్హం. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీలో మహేష్ ద్విపాత్రాభినయం చేయనున్నారని తెలుస్తోంది. హీరో అయిన తర్వాత మహేష్ నాని సినిమాలో కొంత సమయం పాటు డ్యూయల్ రోల్ లో కనిపించారు. అయితే త్రివిక్రమ్ సినిమాలో మాత్రం ఫుల్ లెంగ్త్ డ్యూయల్ రోల్ లో మహేష్ బాబు కనిపించనున్నారని సమాచారం అందుతోంది.

శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో చరణ్ కూడా డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడని సమాచారం అందుతోంది. రవితేజ ధమాకా సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు తెలుస్తోంది. వరుసగా టాలీవుడ్ స్టార్ హీరోలు డ్యూయల్ రోల్ సినిమాలపై ఆసక్తి చూపుతుండటం గమనార్హం. అయితే ఈ సినిమాలు హీరోల కెరీర్ కు ప్లస్ అవుతాయో మైనస్ అవుతాయో చూడాల్సి ఉంది. ఈ స్టార్ హీరోల సినిమాలన్నీ భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతుండటం గమనార్హం.

కెరీర్ విషయంలో స్టార్ హీరోలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలు తర్వాత సినిమాలతో కూడా ఘన విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. టాలీవుడ్ స్టార్ హీరోలలో కొందరు హీరోలు ఏదైనా సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తే ఒక పాత్రలో నెగిటివ్ షేడ్స్ లో కనిపిస్తుండటం గమనార్హం.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus