Mahesh Babu: ‘మహేష్ 29’.. ఆ కన్ఫ్యూజన్ క్లియర్ అయినట్టే..!

Advertisement

మహేష్ బాబు ఎప్పుడు ఏ దర్శకుడితో సినిమా చేస్తాడో.. ఎవ్వరూ ఊహించలేకపొతున్నారు. గతేడాది ‘సరిలేరు నీకెవ్వరు’ తరువాత తన తదుపరి సినిమా వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ఉంటుందని స్వయంగా మహేషే చెప్పుకొచ్చాడు. కానీ సీన్ లోకి పరశురామ్(బుజ్జి) వచ్చాడు.అలా ‘సర్కారు వారి పాట’ సినిమా అనౌన్స్ చెయ్యడం జరిగింది. అటు తరువాత ‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తయిన వెంటనే రాజమౌళి తన తదుపరి మహేష్ తోనే అని అనౌన్స్ చేసాడు. కానీ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ వల్ల.. ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు.

ఇంకో ఏడాది వరకూ టైం పట్టినా ఆశ్చర్యపడనవసరం లేదు.అందుకే ‘సర్కారు వారి పాట’ పూర్తయిన తరువాత మహేష్ ఫాస్ట్ గా మరో సినిమా చెయ్యాలని భావించాడు. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి పేరు ఎక్కువగా వినిపించింది. కానీ త్రివిక్రమ్ తో మహేష్ సినిమా సెట్ అయినట్టు ప్రకటన వచ్చింది. దీంతో అనిల్ రావిపూడితో మహేష్ సినిమా క్యాన్సిల్ అయినట్టే అనే వార్తలు మొదలయ్యాయి.మరో పక్క ‘ఎఫ్3’ తరువాత అనిల్ కూడా బాలయ్య, రామ్ వంటి హీరోలతో సినిమాలు చేయబోతున్నట్టు గుసగుసలు వినిపిస్తుండడంతో..

ఆ వార్తలకు మరింత బలం చేకూరినట్టు అయ్యింది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. అనిల్ తో మహేష్ సినిమా క్యాన్సిల్ అవ్వలేదట. ఇప్పటికే అనిల్ వినిపించిన స్క్రిప్ట్ లో ఫస్ట్ హాఫ్ మహేష్ కు నచ్చిందట. అయితే సెకండ్ హాఫ్ ఇంకా అనిల్ డెవలప్ చేయలేదట. అది కూడా పర్ఫెక్ట్ గా ఫినిష్ చేసిన తరువాత మహేష్ విని ఓకే చేస్తాడని తెలుస్తుంది. త్రివిక్రమ్ సినిమా 5 నెలల్లో ఫినిష్ అయితే.. అనిల్ తో కూడా మహేష్ సినిమా ఫిక్స్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వినికిడి.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
‘జెర్సీ’ లోని ఈ 15 ఎమోషనల్ డైలాగ్స్ ను ఎప్పటికీ మరచిపోలేము..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus