Mahesh Babu: ఆ సినిమాలే ప్రేక్షకులకు దగ్గర చేశాయి.. మహేష్ ఏమన్నారంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి. మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి (SS Rajamouli) సినిమాతో బిజీగా ఉండగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే తను నటించిన సినిమాలలో మహేష్ కు ఎంతో ఇష్టమైన సినిమాలు మురారి, పోకిరి, శ్రీమంతుడు కావడం గమనార్హం. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాయి. మురారి (Murari) సినిమాకు కృష్ణవంశీ ( Krishna Vamsi) దర్శకుడు కాగా పోకిరి (Pokiri) సినిమాకు (Puri Jagannadh) పూరీ జగన్నాథ్, (Srimanthudu) శ్రీమంతుడు సినిమాకు కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వం వహించారు.

ఈ మూడు సినిమాలు కలెక్షన్ల విషయంలో సైతం బాక్సాఫీస్ ను షేక్ చేశాయనే సంగతి తెలిసిందే. మహేష్ బాబు అభిమానులలో మెజారిటీ అభిమానులకు సైతం ఈ సినిమాలే ఇష్టమైన సినిమాలు కావడం గమనార్హం. ఈ సినిమాలే ప్రేక్షకులకు దగ్గర చేశాయని మహేష్ బాబు అన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయో అలాంటి కథలకే ఓటేస్తున్నారు. నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ లో నటించడానికి మహేష్ ఇష్టపడటం లేదు.

రాజమౌళి సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా ఈ సినిమా కోసం మహేష్ బాబు కండలు పెంచుతున్నారని సమాచారం అందుతోంది. మహేష్ రాజమౌళి కాంబో అన్ని భాషల ప్రేక్షకులను మెప్పించే మూవీ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పదేళ్ల క్రితం నుంచి మహేష్ రాజమౌళి మూవీ గురించి ప్రచారం జరుగుతుండగా ఇప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తోంది.

దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండగా మహేష్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ రాజమౌళి కాంబోపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.ఈ సినిమా బడ్జెట్ గురించి సోషల్ మీడియాలో వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం.

‘సలార్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?!

నయన్ విఘ్నేష్ మధ్య విబేధాలకు అదే కారణమా.. అసలేమైందంటే?
నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. వరుడి బ్యాగ్రౌండ్ ఇదే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus