Mahesh Babu :ఆ సినిమాలపై దృష్టి పెడతానన్న మహేష్!

సూపర్ స్టార్ మహేష్ బాబును అభిమానించే ఫ్యాన్స్ తెలుగు రాష్ట్రాల్లో కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఇతర రాష్ట్రాల్లో సైతం మహేష్ బాబుకు చెప్పుకోదగ్గ స్థాయిలో గుర్తింపు ఉంది. మహేష్ పరశురామ్ కాంబినేషన్ లో సర్కారు వారి పాట సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమా పాన్ ఇండియా సినిమా అవునో కాదో క్లారిటీ రావాల్సి ఉంది. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ, మహేష్ రాజమౌళి కాంబో మూవీ పాన్ ఇండియా సినిమాలు కావడం గమనార్హం.

తాజాగా ఫోర్బ్స్ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో మహేష్ బాబు మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. భవిష్యత్ సినిమాలను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయాలని భావిస్తున్నానని మహేష్ చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా మార్కెట్ ను విస్తరించడానికి సమయం ఆసన్నమైందని మహేష్ బాబు తెలిపారు. గతంలో మహేష్ కు బాలీవుడ్ మూవీ ఆఫర్లు వచ్చినా మహేష్ వాటికి ఓకే చెప్పలేదు. ఈ ఇంటర్వ్యూలో రాజమౌళి సినిమా గురించి మహేష్ స్పష్టతనిచ్చారు. వచ్చే ఏడాది రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కే మూవీ ప్రారంభమవుతుందని మహేష్ చెప్పుకొచ్చారు.

జక్కన్న డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా అన్ని భాషల్లో విడుదలవుతుందని మహేష్ బాబు తెలిపారు. సరైన కథ వస్తే బాలీవుడ్ సినిమాలో నటించడానికి తనకు అభ్యంతరం లేదని మహేష్ పేర్కొన్నారు. మహేష్ మార్కెట్ ను పెంచుకునే దిశగా అడుగులు వేస్తుండటంపై ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. మహేష్ సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ షూటింగ్ త్వరలో మొదలు కానుంది.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus