మహేష్ క్రేజ్ కి నిదర్శనం!

టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా ఎదిగిన మహేష్ బాబు.. సోషల్ మీడియాలో కూడా సూపర్ స్టార్ తనేనని మరోసారి రుజువు చేశాడు. 2020 సంవత్సరం చివరికి వచ్చిన నేపథ్యంలో వివిధ అంశాల్లో ఈ ఏడాది టాప్ లో నిలిచిన హ్యాష్ ట్యాగ్స్, ఫోటోలు, వీడియోలు, పోస్ట్ ల గురించి ట్విట్టర్ వివరాలు వెల్లడిస్తోంది. ఈ ఏడాది ఇండియా మొత్తంలో టాప్ 3 లో నిలిచిన సినిమా ట్యాగ్స్ లో మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ కి సంబంధించిన ట్యాగ్ ఉండడం విశేషం. బాలీవుడ్ హీరో సుశాంత్ రాజ్ పుత్ నటించిన చివరి సినిమా ‘దిల్ బేచారా’ హ్యాష్ ట్యాగ్ ఈ లిస్ట్ లో టాప్ లో ఉండగా.. ‘సూరారై పొట్రు’ రెండో స్థానంలో నిలిచింది.

ఈ రెండు సినిమాల తరువాత మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’కి మూడో స్థానం దక్కింది. అల్లు అర్జున్ నటించిన ‘అల.. వైకుంఠపురములో’, బాలీవుడ్ లో ‘తాన్హాజీ’ లాంటి సినిమాలు బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచినప్పటికీ.. వాటిని పక్కకి నెట్టి ‘సరిలేరు నీకెవ్వరు’ చోటు దక్కించుకోవడం విశేషం. టాలీవుడ్ కి సంబంధించి వరుసగా మూడేళ్లుగా మహేష్ సినిమాల హ్యాష్ ట్యాగ్ లే టాప్ లో ఉంటున్నాయి.

2018లో ‘భరత్ అనే నేను’, 2019లో ‘మహర్షి’ హ్యాష్ ట్యాగ్ లు అగ్ర స్థానంలో నిలిచాయి. దీన్ని బట్టి సోషల్ మీడియాలో కూడా మహేష్ కి క్రేజ్ మాములుగా లేదని అర్ధమవుతోంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం మహేష్ ‘సర్కారు వారి పాట’ సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. పరశురామ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించనుంది.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus