Mahesh Babu: ఆ విషయంలో మహేష్ బాబు మారిపోయారా?

సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్నేళ్ల క్రితం వరకు వేగంగా సినిమాలలో నటించిన టాలీవుడ్ హీరోలలో ఒకరనే సంగతి తెలిసిందే. అయితే మహేష్ బాబు ప్రస్తుతం రూటు మార్చారు. నిదానమే ప్రధానం అనే సూత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు ఫాలో అవుతున్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమా రిలీజైన రెండున్నర సంవత్సరాల తర్వాత సర్కారు వారి పాట సినిమా థియేటర్లలో విడుదలై హిట్ గా నిలిచింది. త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాకే షూటింగ్ ను మొదలుపెట్టాలని మహేష్ బాబు భావిస్తున్నారు.

ఆగష్టు నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుండగా 2023 సంవత్సరం సమ్మర్ కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైతే రిలీజ్ డేట్ మారే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు. మహేష్ జక్కన్న కాంబోలో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఎంత సమయమైనా కేటాయిస్తానని మహేష్ బాబు ఇప్పటికే వెల్లడించారనే సంగతి తెలిసిందే. ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేయడం కంటే తక్కువ సినిమాలలో నటించినా ఆ సినిమాలు సక్సెస్ సాధించేలా మహేష్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మహేష్ క్రేజ్ ను చూసి ఇతర హీరోలు సైతం షాకవుతున్నారు. మహేష్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు పూర్తయ్యే వరకు కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించరని తెలుస్తోంది. మహేష్ బాబు ప్రస్తుతం ఒక్కో సినిమాకు 60 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. సినిమాసినిమాకు మహేష్ బాబు రెమ్యునరేషన్ అంతకంతకూ పెరుగుతోంది.

సినిమాలు, యాడ్స్ ద్వారా మహేష్ బాబు ఏడాదికి 70 కోట్ల రూపాయల నుంచి 80 కోట్ల రూపాయల రేంజ్ లో సంపాదిస్తున్నారని తెలుస్తోంది. కెరీర్ విషయంలో మహేష్ బాబు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మహేష్ బాబు భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో సంచలనాలను సృష్టించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus