అన్ స్టాపబుల్ ప్రోమో: బాలయ్య – మహేష్ ల సందడి మాములుగా లేదు..!

బాలయ్య ‘ఆహా’ వారి కోసం హోస్ట్ చేస్తున్న ‘అన్ స్టాపబుల్’ కు మహేష్ బాబు కూడా గెస్ట్ గా వచ్చాడు. ఈ ఎపిసోడ్ ను ఎందుకో చివరి వరకు దాచిపెట్టారు ‘ఆహా’ వారు. మొత్తానికి ఫిబ్రవరి 4న ఈ ఎపిసోడ్ ను విడుదల చేయబోతున్నారు. దానికి సంబంధించిన ప్రోమోని కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. ఈ ప్రోమో ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటుంది. ఈ ప్రోమో హైలెట్స్ విషయానికి వస్తే..

‘ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో.. అతనే’ అంటూ మహేష్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పాడు బాలయ్య.

‘అసలు మహేష్.. ఎవరు?’ అని బాలయ్య అడగ్గా.. ‘ఐ యామ్ ఎ ఫాథర్ టు మై చిల్డ్రన్ అండి’ అంటూ చెబుతున్నాడు.

‘ఎవరు క్యాటు ఎవరు బ్రాటు’ అని బాలయ్య అడగ్గా .. ‘గౌతమ్ క్యాటు… సితార బ్రాటు తాట తీసేస్తుంది అంటూ మహేష్ ఫన్నీ గా జవాబిచ్చాడు.

‘మీ నాన్నగారు ఫుల్ సెటైర్లు నువ్వు కూడా సెటైర్లకు బాప్ అని విన్నానే’ అని బాలయ్య అనగా .. ‘నాది ఉంటది అండి ఓ టైమింగ్ ఉంటది’ అంటూ మహేష్ జవాబిచ్చాడు.

నమ్రత టాపిక్ ను బాలయ్య తీసుకురాగా.. ‘ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలి అండి’ అంటూ మహేష్ అనడం నవ్వులు పూయిస్తుంది.

 

‘భరత్ అనే నేను’ షూటింగ్ టైములో ఓ లేడీ ఆర్టిస్ట్ పై సీరియస్ అయినట్టు మహేష్ చెప్పాడు. ‘నా ప్లేస్ లో కనుక మీరుంటే మైక్ విసిరేసేవాళ్ళు’ అంటూ బాలయ్య పై ఓ సెటైర్ వేసి నవ్వులు పూయించాడు.

అటు తర్వాత దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా ఎంటర్ అయ్యాడు.

1000 మంది చిన్నారులకి పైగా హార్ట్ సర్జెరీలు చేయించి ప్రాణదానం చేసినందుకు మహేష్ ను అభినందించాడు బాలయ్య. అదే టైములో ‘గౌతమ్ 6వారాలు ముందు పుట్టాడు. తను పుట్టినప్పుడు నా చెయ్యి అంతే ఉన్నాడు. మాకంటే డబ్బులున్నాయి మరి మిగిలిన వాళ్ళ సంగతేంటి అనే ఉద్దేశంతో’ ఈ హార్ట్ సర్జెరీలు చేయించడం మొదలు పెట్టాను అంటూ మహేష్ జవాబిచ్చాడు.

ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మీరు కూడా ఓ లుక్కేయండి :

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus