కమెడియన్ మనోజ్ పై విరుచుకుపడుతున్న మహేష్ అభిమానులు!

తమిళ స్టాండప్ కమెడియన్ మనోజ్ ప్రభాకర్ గురించి అతి తక్కువమందికి మాత్రమే తెలుసు. కానీ నిన్న అతను పోస్ట్ చేసిన ఒక వీడియోతో వార్తల్లో వ్యక్తిగా అయ్యారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటనను విమర్శించి  ఫ్యాన్స్ ఆగ్రహానికి గురి అయ్యారు. ఓ వేదికపై అతను ప్రదర్శన ఇస్తూ మహేష్ ను టాపిక్ గా తీసుకున్నారు. మహేష్ బాబుపై తనకు వ్యక్తిగతమైన కక్షలు ఏమీ లేదంటూనే విమర్శించారు. అతను అందగాడు అయినప్పటికీ నటన కొంచెం కూడా రాదని కించపరిచారు. కత్రినా కైఫ్ కి మేల్ వర్షన్ అంటూ అవమానించారు. ఎస్ జె సూర్య సగం మోహంలో చూపించే అభినయంలో మహేష్ కొంచెం కూడా చూపించలేకపోయారని హేళన చేశారు. స్పైడర్ అతని తొలి తమిళ సినిమా అయినప్పటికీ తెలుగులో చాలా సినిమాలు చేశారని, అందులో ఒక్కడు, ఆగడు, దూకుడు, సైనికుడు అనే సినిమాలు చేశారని ఆయా చిత్రాల ద్వారా దర్శకులు “కుడు ( ఇవ్వు)” నటనని మాకు ఇవ్వమని అడిగినా మహేష్ బాబు ఇవ్వలేకపోయారని నవ్వుతూ ఆరోపించారు.

అలాగే స్పైడర్ మూవీ మహేష్ డేటాని హ్యాక్ చేసే వ్యక్తిగా కనిపించారని, అతనిలా తాను ఫోన్ హ్యాక్ చేసి చూస్తే ఒకే ఎక్స్ ప్రెషన్ కనిపించిందని తీవ్రంగా విమర్శించారు. చివరగా హైదరాబాద్ లో రెండు బండరాళ్లను చూపిస్తూ.. అవి మహేష్ బాబు రాక్స్ అని చెప్పారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు అభిమానించే ఓ నటుడిని అవమాన పరచడాన్ని నెటిజనులు తప్పు పట్టారు. అభిమానులు అయితే అతనిపై విరుచుకు పడ్డారు. తమ హీరోని అన్ని మాటలు అంటావా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మనోజ్ ఆ వీడియోని యూట్యూబ్ లో నుంచి తీసేసారు. అయినప్పటికీ మనోజ్ సారీ చెప్పాల్సిందేనని మహేష్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus