అదంతా మరిచిపోయావా పూరి.. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావ్..!

ఓ పక్క సూపర్ హిట్టందుకుని మంచి జోష్ లో ఉన్న పూరికి.. మరో వైపు మహేష్ ఫ్యాన్స్ నుండీ ట్రోల్స్ ఓ రేంజ్లో వస్తున్నాయి. ‘నేను హిట్లలో ఉన్నప్పుడే మహేష్ సినిమా చేస్తాడు’ అంటూ పూరి ఈమధ్య చేసిన కామెంట్ పెద్ద ధూమరమే రేపింది. మహేష్ ని సూపర్ స్టార్ చేసింది ‘పోకిరి’ సినిమానే కాదనలేం..! అయితే ‘ఆ చిత్రం ఇండస్ట్రీ హిట్టెలా అయ్యిందో నాకే అర్ధం కావట్లేదు’ అంటూ పూరి చాలా సార్లు చెప్పాడు. అంటే ఆ సక్సెస్ క్రెడిట్ పూర్తిగా పూరీదే అనడానికి లేదు. ఇక ‘పోకిరి’ కి ముందు పూరి కి ‘సూపర్’ ‘143’ ‘ఆంధ్రావాలా’ వంటి మూడు ప్లాపులున్నాయి.

ఇక ‘బిజినెస్మేన్’ సినిమా కూడా సూపర్ హిట్టైంది. 2012 లో వచ్చిన ఈ చిత్రం అప్పటికే 40 కోట్లకు పైగా షేర్ ను వసూల్ చేసి మళ్ళీ పూరికి పెద్ద హీరోలని డైరెక్ట్ చేసే ఛాన్స్ లు ఇచ్చింది. ఇక ఈ చిత్రానికి ముందు కూడా పూరికి ‘నేను నా రాక్షసి’ ‘ఏక్ నిరంజన్’ ‘గోలీమార్’ వంటి ప్లాపులు ఉన్నాయి. సో ‘బిజినెస్మేన్’ కి ముందు కూడా పూరికి హిట్లు లేవు. అప్పటి టైంకి మహేష్ ‘దూకుడు’ వంటి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అలాంటి టైంలో ప్లాపుల్లో ఉన్న పూరికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇక ఆ చిత్రం హిట్టయ్యాక పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టాడు పూరి. ‘అదంతా మరిచి పోయావా పూరి’ అంటూ పై లాజిక్కులు అనీ చెప్పి మహేష్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ప్లాపుల్లో ఉన్నప్పుడు లైఫ్ ఇచ్చిన మహేష్ ఇప్పుడు నీకు తక్కువైపోయాడా’ అంటూ ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus