జనవరి 26 న విడుదల కానున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఫస్ట్ లుక్

కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సినిమా వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.  హైదరాబాద్ లోని బిజీ రోడ్లపై మూడో షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నాలుగో షెడ్యూల్ కోసం గుజరాత్ కి వెళ్ళింది. ఆ రాష్ట్ర ముఖ్య పట్టణం అహ్మదాబాద్ లో రేపటి నుంచి కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారు. 100 కోట్ల బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో సూపర్ స్టార్ ఇన్వెస్ట్ గేషన్ ఆఫీసర్ గా నటిస్తున్నారు.

స్పెషల్ పోలీస్ గా  ప్రిన్స్ లుక్ ని చూసే తేదీ ఖరారు అయింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రిపబ్లిక్ డే కి రిలీజ్ చేయాలనీ మురుగదాస్ ఫిక్స్ అయ్యారు. అప్పుడే టైటిల్ కూడా రివీల్ కానుంది. సూపర్ స్టార్ సరసన ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న ఈ మూవీకి  హరీష్ జయరాజ్ సంగీతమందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ పనిచేస్తున్న ఈ సినిమాలో తమిళ డైరక్టర్ ఎస్.జె.సూర్య విలన్ గా నటిస్తున్నారు. క్రేజీ యాక్టర్స్, గ్రేట్ టెక్నీషియన్స్ తో రూపుదిద్దుకుంటున్న ఈ ఫిల్మ్ పై భారీ అంచనాలున్నాయి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus