Mahesh Babu: బుర్రిపాలెంలో విద్యార్థులకు డిజిటల్ లెర్నింగ్.. మంచి మనసు చాటుకున్న మహేష్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన కేవలం హీరోగా మాత్రమే కాకుండా ఎంతో మంచి మనసున్న వ్యక్తిగా కూడా పేరు ప్రఖ్యాతలు పొందారు. ఇలా మహేష్ బాబు తన ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే ఎంతోమంది చిన్నారులకు గుండె ఆపరేషన్లను నిర్వహిస్తూ ఎంతో మంది ప్రాణాలను కాపాడారు. ఇలా మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా ఉన్నారు.

ఈ క్రమంలోనే మహేష్ బాబురెండు గ్రామాలను దత్తత తీసుకొని ఆ గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఆ గ్రామాలలో మౌలిక సదుపాయాలను సమకూర్చిన మహేష్ బాబు మరోసారి తన ఫౌండేషన్ ద్వారా తన దత్తత తీసుకున్న బుర్రిపాలెం గ్రామంలోని గవర్నమెంట్ పాఠశాలలో విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలన్నింటిని సమకూర్చారు.మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా మరో అడుగు ముందుకు వేసి ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం డిజిటల్ లెర్నింగ్ క్లాసులను ప్రారంభించారు.

విద్యార్థులకు కంప్యూటర్లను పంపిణీ చేసి డిజిటల్ లెర్నింగ్ తరగతులలో శిక్షణ ఇప్పిస్తున్నట్లు నమ్రత సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.మహేష్ బాబు ఫౌండేషన్ మరో మంచి పనికి శ్రీకారం చుట్టిందని విద్యార్థుల డిజిటల్ లెర్నింగ్ కోసం కంప్యూటర్లు ఏర్పాటు చేసింది ఇది చాలా గొప్ప రోజు అంటూ నమ్రత సోషల్ మీడియా వేదికగా ఇందుకు సంబంధించిన వీడియోని షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఈ వీడియో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.

ఈ విషయం తెలిసిన ఎంతోమంది మహేష్ బాబు అభిమానులు అలాగే నేటిజన్స్ మహేష్ బాబు మంచితనం పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఈ పోటీ ప్రపంచంలో విద్యార్థులకు తప్పనిసరిగా కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతో అవసరం ఈ క్రమంలోనే గవర్నమెంట్ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఈ విధంగా కంప్యూటర్లను సమకూర్చి డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలను అందించడం పట్ల ఎంతోమంది ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus