ఒకప్పుడు ఏదైనా స్పెషల్ డే ఉంటే పాత సినిమాలను మళ్లీ రిలీజ్ చేసేవాళ్లు. అది కూడా చాలా తక్కువ సంఖ్యలోనే ఇలాంటి సందర్భాలు కనిపించేవి. కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం టాలీవుడ్‌లో రీ రిలీజ్ చిత్రాల హవా కనిపిస్తోంది. టాలీవుడ్‌లోని స్టార్ హీరోల పుట్టినరోజులనో, మరో స్పెషల్ డేనో పురస్కరించుకుని వాళ్ల వాళ్ల సూపర్ హిట్ సినిమాలను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఇలా ఇప్పటికే ఎన్నో రకాల సినిమాలు మళ్లీ తెరపైకి వచ్చి ఓ రేంజ్‌లో సందడి చేసిన విషయం తెలిసిందే.
మహేష్ బాబు (Mahesh Babu) కథానాయకుడిగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ ‘బిజినెస్ మేన్’ తెరకెక్కించారు. ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా వచ్చి సుమారు 11 ఏళ్ళు అవుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12, 2012లో విడుదల కాగా… అప్పట్లో 90 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది.మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా ఈ నెల 9న ‘బిజినెస్ మేన్’ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ విశాఖలో అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి.
విశాఖపట్టణంలోని ప్రముఖ థియేటర్లలో ఒకటైన శరత్ సంగంలో ఉదయం 7.30 గంటలకు రెండు షోలు వేస్తున్నారు. బుకింగ్స్ ఓపెన్ చేసిన గంటలో ఆ రెండు షోస్ హౌస్ ఫుల్స్ అయ్యాయి. ఊర్వశి థియేటర్ డాల్బీ 2కెలో సాయంత్రం ఆరు గంటలకు మరో షో వేస్తున్నారు. ఆ షో అడ్వాన్స్ బుకింగ్స్ లేటెస్టుగా ఓపెన్ చేశారు. ఫాస్ట్ ఫిల్ అవుతున్నాయి. ఒక్క విశాఖలో మాత్రమే కాదు…
అనకాపల్లి, హైదరాబాద్, విజయవాడ, వరంగల్ వంటి ఏరియాల్లోనూ, అమెరికాలోనూ ‘బిజినెస్ మేన్’ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మహేష్ క్రేజ్ చూస్తుంటే… బుకింగ్స్ ఓపెన్ అవ్వడమే ఆలస్యం, వెంటనే హౌస్ ఫుల్స్ అయ్యేలా ఉన్నాయి. రీ రిలీజ్ సినిమాల్లో కలెక్షన్స్ పరంగా ‘బిజినెస్ మేన్’ రికార్డులు క్రియేట్ చేసేలా ఉంది.
ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!
‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?