Mahesh Babu: తన ఫ్యామిలీతో మహేష్ బాబు సెల్ఫీ వైరల్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు సంబంధించిన ఏ ఫోటో బయటకు వచ్చినా అది ఇంటర్నెట్ ను షేక్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా మహేష్ కు లేడీ ఫ్యాన్స్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ లో క్రేజ్ ఎక్కువ కాబట్టి.. ఆ కొత్త ఫోటోలు వైరల్ అవుతుంటాయి అని చెప్పాలి. ‘సర్కారు వారి పాట’.. రిలీజ్ అయ్యాక తన భార్య, పిల్లలతో కలిసి విదేశాలకు వెళ్లిన మహేష్ అక్కడ బాగా ఎంజాయ్ చేసి ఈ మధ్యనే ఇండియాకి తిరిగి వచ్చాడు.

ఇక తాజాగా ఘట్టమనేని ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒకే చోట కలిసినట్టు ఉన్నారు. దీంతో ఫ్యామిలీ మొత్తం తో కలిసి ఓ సెల్ఫీ దిగాడు మహేష్. ఈ ఫోటోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ‘వన్ విత్ ఫామ్’ అంటూ కామెంట్ పెట్టాడు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహేష్ ఫ్యామిలీతో పాటు మంజుల ఘట్టమనేని ఫ్యామిలీ, హీరో సుధీర్ బాబు ఫ్యామిలీ, పొలిటిషన్ గల్లా జయదేవ్ ఫ్యామిలీ కూడా ఉంది.

నిజానికి వీళ్లంతా కృష్ణ గారి పుట్టినరోజు నాడు కలుస్తూ ఉంటారు. కానీ కృష్ణ గారి పుట్టినరోజు నాడు మహేష్ విదేశాల్లో ఉన్నాడు. అందుకే ఇప్పుడు అంతా ఒక చోట కలిసినట్టు తెలుస్తుంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి రెడీ అవుతున్న మహేష్.. అనంతరం రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus