Mahesh Babu: రాజమౌళి సినిమాలో మహేష్ ఆ లుక్ లో కూడా కనిపిస్తారా?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి (S. S. Rajamouli) మహేష్ బాబుతో (Mahesh Babu)  సినిమా కోసం సాధారణంగా ఇతర సినిమాల కొరకు తీసుకునే సమయం కంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి షాకింగ్ అప్ డేట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. పాన్ వరల్డ్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుండగా 1000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతోంది. రాజమౌళి సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో మహేష్ బాబు రగ్డ్ లుక్ లో కనిపిస్తారని సమాచారం అందుతోంది.

మహేష్ బాబు ఇప్పటివరకు ఇలాంటి లుక్ లో కనిపించలేదనే సంగతి తెలిసిందే. మహేష్ లుక్ కొత్తగా ఉంటే మాత్రం సినిమాపై అంచనాలు అమాంతం పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం మహేష్ బాబు లుక్ మార్చుకునే పనిలో బిజీగా ఉన్నారని సమాచారం అందుతోంది. విల్బర్ స్మిత్ నవలల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుండగా విజయేంద్ర ప్రసాద్ మహేష్ ఇమేజ్ ను మార్చేసేలా ఈ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం అందుతోంది.

రాజమౌళి మహేష్ కాంబో నెక్స్ట్ లెవెల్ కాంబో అవుతుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మహేష్ ఫ్యాన్స్ ఈ సినిమా కొరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కోసం సాయిమాధవ్ బుర్రా పని చేస్తున్నారని తెలుస్తోంది. సాయిమాధవ్ బుర్రా ఈ సినిమాకు డైలాగ్స్ రాస్తున్నారని భోగట్టా. మహేష్ రాజమౌళి కాంబో మూవీ ఇతర భాషల్లో సైతం విడుదల కానుందని సమాచారం అందుతోంది.

అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే లక్కీ ఛాన్స్ ఎవరి సొంతమవుతుందో చూడాల్సి ఉంది. మహేష్ జక్కన్న కాంబో మూవీ 2026 ఎండింగ్ లో రిలీజయ్యేలా రాజమౌళి ప్లానింగ్ ఉందని తెలుస్తోంది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందని సమాచారం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus