Mahesh Babu: రాజమౌళి సినిమా కోసం మహేష్ ఆ త్యాగం చేస్తాడా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఏడాదిలో 4 నుండి 6 సార్లు విదేశాలకి టూర్లు వెళ్లి వస్తాడు. అది కూడా ఫ్యామిలీని తీసుకుని. ఎంత బిజీలో ఉన్నా సరే.. తన ఫ్యామిలీ కోసం విదేశాలకి టూర్ వేస్తుంటాడు మహేష్ బాబు. ఈ విషయాన్ని ఆయన చాలా సార్లు చెప్పుకొచ్చాడు. ‘మనం ఎంత సంపాదించినా.. ఫ్యామిలీకి పర్టిక్యులర్ టైం ఇవ్వకపోతే.. మనం సంపాదించినా వేస్ట్. నా పిల్లలకు హాలిడేస్ వచ్చినప్పుడు.. ఫారిన్ ట్రిప్..లకి తీసుకెళ్తూ ఉంటాను.

Mahesh Babu

అప్పుడు నేను వాళ్ళకి క్వాలిటీ టైం ఇచ్చినట్టు అవుతుంది. పేరెంట్స్ పిల్లలకి క్వాలిటీ టైం ఇవ్వాలి. వాళ్ళకి ఆ టైంలో అన్నీ అర్థమయ్యేలా వివరించాలి. అది పేరెంట్స్ గా మన బాధ్యత. సంక్రాంతి హాలిడేస్, సమ్మర్ హాలిడేస్, దసరా హాలిడేస్, క్రిస్మస్ హాలిడేస్.. అలాంటి టైంలో పిల్లలని విదేశాలకి ట్రిప్స్ కి తీసుకెళ్తూ ఉంటాను’ అంటూ మహేష్ బాబు పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు.

అంతా బాగానే ఉంది కానీ.. ఇక నుండి కొన్నేళ్ల పాటు మహేష్ బాబు విదేశాలకి ట్రిప్పులు వేయడం కుదరకపోవచ్చు అనేది ఇన్సైడ్ టాక్. ఎందుకంటే.. మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి (Rajamouli) సినిమా కోసం కమిట్ అయ్యాడు. అతని కెరీర్లో ఇది 29 వ సినిమాగా రూపొందనుంది. ఈ సినిమా దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ తో రూపొందనుంది.

అది కూడా రెండు, మూడు పార్టులుగా అని సమాచారం. 2025 జనవరి నుండి ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. అంటే మొదటి పార్ట్ కంప్లీట్ అవ్వడానికి 2027 వరకు టైం పడుతుంది. కాబట్టి గతంలో మాదిరి మహేష్ బాబు..ఫ్యామిలీతో కలిసి విదేశాలకు ట్రిప్పులు వేయడం కుదరకపోవచ్చు అని ఇన్సైడ్ టాక్.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus