Mahesh Babu: రాజమౌళి సినిమాతో మహేష్ ఊహించని రికార్డులను సొంతం చేసుకోనున్నారా?

మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా వచ్చే ఏడాది మొదలుకానుంది. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుండగా గుంటూరు కారం అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండనుందని సమాచారం అందుతోంది. ఈ సినిమా మహేష్ బాబు రేంజ్ ను పెంచడం ఖాయమని రాజమౌళి సినిమాతో మహేష్ కు గ్లోబల్ రేంజ్ లో ఇమేజ్ రావడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రాజమౌళి సినిమా తర్వాత మహేష్ మార్కెట్ 3000 కోట్ల రూపాయల నుంచి 4000 కోట్ల రూపాయల రేంజ్ లో పెరగనుందని తెలుస్తోంది. రాజమౌళి సినిమాతో మహేష్ బాబు ఊహించని రికార్డులను సొంతం చేసుకోనున్నారని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ కు జోడీగా ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ నటించనున్నారని భోగట్టా. హాలీవుడ్ ఇండస్ట్రీ టార్గెట్ గా ఈ సినిమా తెరకెక్కుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మహేష్ రాజమౌళి కాంబో మూవీ బడ్జెట్ 1000 కోట్ల రూపాయలు కాగా ఈ సినిమాకు 1500 కోట్ల రూపాయల బిజినెస్ జరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ కొత్తగా ఉండనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి జక్కన్న లొకేషన్ల వేటలో ఉన్నారని సమాచారం అందుతోంది. రాజమౌళి రేంజ్ ఈ సినిమాతో మరింత పెరగనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జక్కన్న వరుస విజయాలను సొంతం చేసుకునేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటుండగా మహేష్ తో సినిమా సక్సెస్ సాధిస్తే రాజమౌళి భవిష్యత్తు ప్రాజెక్ట్ లు నెక్స్ట్ లెవెల్ లో ఉండనున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాజమౌళి ఈ సినిమాకు 150 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. రాజమౌళి సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus