మహేష్ బాబు రూల్స్ కు ఇబ్బంది పడుతున్న ప్రేక్షకులు

  • September 4, 2019 / 07:24 PM IST

కొన్ని సినిమాలు జనాల్ని బాగా ప్రభావితం చేస్తుంటాయి. కేవలం సినిమాలో హీరో వేసుకునే షర్ట్ లు, ఫాంట్ లు, కళ్ళ జోడు గురించి మాత్రమే మాట్లాడట్లేదు. పలనా సినిమాలో డైరెక్టర్ చెప్పే సందేశం కూడా బయట బాగా పాపులర్ అవుతుంది. రెండు ప్రయోగాత్మక చిత్రాలు చేసి చేతులు కాల్చుకున్న టైములో మహేష్ బాబు కొరటాల శివ డైరెక్షన్లో ‘భరత్ అనే నేను’ చిత్రం చేశాడు. ఈ సినిమా బాగా ఆడింది. మహేష్ ప్లాపుల నుండీ బయట పడ్డాడు కానీ ప్రేక్షకులకు మాత్రం ఇప్పుడు ఈ చిత్రం పెద్ద తలనొప్పిగా మారిందట. అదేంటి ఎప్పుడో వచ్చిన సినిమాతో ఇప్పుడు ఏ ఇబ్బంది వచ్చి పడింది అనేగా మీ డౌట్?

విషయం ఏమిటంటే… ‘భరత్ అనే నేను’ సినిమాలో సీఎం భరత్ గా మహేష్ ట్రాఫిక్ నిబంధనల విషయంలో భారీ ఎత్తున ఫైన్ లు వేసి .. మోరల్ డైలాగ్స్ చెప్తాడు. ఆ సీన్ కి అందరూ చప్పట్లు కొట్టారు. సీఎం భరత్ ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన నేరానికి 10వేలు, 20 వేలు, 25 వేలు అంటూ జరిమానా పెంచుకుంటూ పోతాడు. ప్రస్తుతం ఈ సన్నివేశాన్ని సోషల్ మీడియాలో మళ్ళీ గుర్తుచేసుకుంటున్నారు నెటిజన్లు. అప్పుడు ఆ సీన్లకి చప్పట్లు కొట్టిన ప్రేక్షకులు ఇప్పుడు ఆ సీన్లు చూస్తేనే బాధపడుతున్నారట. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త ట్రాఫిక్ రూల్స్ హాట్ టాపిక్ గా మారాయి. గురుగ్రామ్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు కఠినంగా ఈ రూల్స్ ని పాటిస్తున్నారు. ఓ బైకర్ ట్రాఫిక్ రూల్స్ పాటించనందుకు 21వేలు, మరో ఆటో డ్రైవర్ కు 32 వేలు ఫైన్ విధించారు. ‘మహేష్, కొరటాల సినిమా పెద్ద తలనొప్పేగా మారిందే’ అని కామెంట్స్ కూడా పెడుతున్నారు. అంటే ఆ సినిమా చూసే ఈ కొత్త రూల్స్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని వారనుకుంటున్నారన్న మాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus