సూపర్ స్టార్ మహేష్ బాబు “బ్రహ్మోత్సవం” సినిమా తర్వాత చేయనున్నమూవీ సెట్స్ మీదకు వెళ్ళడానికి అంతా సిద్ధమైంది. కమర్షియల్ డైరక్టర్ ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. 80 కోట్లతో టాగూర్ మధు, ఎన్ వీ ప్రసాద్ లు రెండు భాషల్లో నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ జూలై 19 నుంచి మొదలవుతుందని అధికారికంగా ప్రకటించారు. మొదటగా ఒక పాటను పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు.
మహేష్ తొలి సారి తమిళం, తెలుగులో చేస్తున్న సినిమా కావడంతో నటీనటుల ఎంపికలో జాగ్రత పడ్డారు. కొత్తగా ఉండాలని విలన్ పాత్రకు తమిళ దర్శకుడు, నటుడు అయిన సూర్యను సెలక్ట్ చేసారు. ఫ్రెష్ లుక్ కోసం బాలీవుడ్ సుందరి పరిణీత చోప్రాను హీరోయిన్ గా ఖరారు చేశారు. ఈ చిత్రానికి హరీష్ జయరాజ్ చక్కని పాటలను అందించే పనిలో పడ్డాడు.