విజయాల చుట్టూ వివాదాలుంటాయని పెద్దలు ఊరికినే అనలేదు. కొన్ని సంఘటనలను చూసినప్పుడు ఆమాట వాస్తవమని మనం అనాల్సిందే. కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కలక్షన్ల వర్షం కురిపించింది. అయితే ఈ సినిమా తాను రాసిన నవలను ఆధారంగా రూపొందిందని రచయిత శరత్ చంద్ర అప్పట్లో గగ్గోలు పెట్టారు. ఇందంతా కామన్ అంటూ చిత్ర బృందం లైట్ తీసుకుంది. ఆయన మాత్రం సీరియస్ గా తీసుకున్నారు. స్వాతి మాస పత్రికలో తాను ‘చచ్చేంత ప్రేమ’ అనే శీర్షికతో రాసిన నవలను శ్రీమంతుడు చిత్రంగా మలిచారని ఆరోపిస్తూ కుట్రపూరిత నేరం ఐపీసీ 120బి కింద కేసు నమోదు చేయాలని కోరుతూ క్రిమినల్ కోర్టులో శరత్‌చంద్ర కేసు వేశారు.
దీని ప్రకారం కోర్టు కొన్ని రోజుల క్రితం హీరో మహేష్ బాబు, డైరక్టర్ కొరటాల శివ, నిర్మాత ఎర్నేని నవీన్ లకి సమన్లు జారీ చేసింది. అయినా వారు పట్టించుకోలేదు. నేడు ఈ కేసు విచారణ జరిగింది. వాదోపవాదనలు విన్న కోర్ట్ ఈరోజు ఎమ్ బి క్రియేషన్స్ అధినేత మహేష్ బాబు, మైత్రి మూవీస్ అధినేత ఎర్నేని నవీన్, చిత్ర దర్శకుడు కొరటాల శివ లు మార్చి 3వ తేదీన నాంపల్లి కోర్ట్ కు హాజరు కావాలని ఆదేశించింది. కొరటాల శివతో కలిసి బ్యాకాంక్ లో కొత్త సినిమా కథ వింటున్న మహేష్ బాబుకి ఇది కొత్త తలనొప్పిగా మారింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.