Mahesh Babu: ఆ పొరపాట్లు జరగకుండా మహేష్ ఆచితూచి అడుగులేస్తారా.. ఏమైందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన మహేష్ బాబు వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న మహేష్ బాబు ఈ సినిమా పూర్తైన తర్వాత రాజమౌళి సినిమాలో నటించనున్నారు. అయితే మహేష్ రెండేళ్లకు ఒక సినిమాలో నటించడం వల్ల ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. మహేష్ ప్లానింగ్ మారాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఒకేసారి రెండు సినిమాలలో నటించడం లేదా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాను ఏడాదిలోగా పూర్తి చేసేలా మహేష్ బాబు ప్లాన్ చేసుకోవాల్సి ఉంది.

కథ, కథనం విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా మహేష్ బాబు (Mahesh Babu) జాగ్రత్త పడితే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహేష్ బాబు నుంచి ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. గుంటూరు కారం సినిమాకు సంబంధించి చోటు చేసుకున్న మార్పులు మహేష్ ఫ్యాన్స్ ను బాధ పెట్టాయి. గుంటూరు కారం సినిమా విషయంలో త్రివిక్రమ్ స్పెషల్ కేర్ తీసుకోవాలని ఈ సినిమాతో అల వైకుంఠపురములో సినిమాను మించిన సక్సెస్ ను సాధించాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

2024 సంక్రాంతికి ఈ సినిమా కచ్చితంగా థియేటర్లలో విడుదల కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సాధారణంగా సంక్రాంతికి సినిమాలు విడుదలైతే భారీ స్థాయిలో కలెక్షన్లు వస్తాయి. అందువల్ల త్రివిక్రమ్ శ్రీనివాస్ సంక్రాంతి రిలీజ్ డేట్ ను మిస్ చేసుకోవద్దని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ తర్వాత ప్రాజెక్ట్ తో కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉంది.

ఈ సినిమా తర్వాత బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ కాగా ఆ సినిమాకు సంబంధించి అధికారికంగా క్లారిటీ రావాల్సిఉంది. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. రాజమౌళి సినిమాతో మహేష్ బాబు 100 కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే హీరోల జాబితాలో చేరనున్నారని తెలుస్తోంది.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus