సూపర్ స్టార్ లైనప్ అదిరింది.. ఫ్యాన్స్ కు పండగే..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. మహేష్ కెరీర్లో ఈ చిత్రం హైయెస్ట్ కలెక్షన్స్ ను రాబట్టింది. ఈ చిత్రంతో మహేష్ హ్యాట్రిక్ కంప్లీట్ చేసాడు. ‘భరత్ అనే నేను’ ‘మహర్షి’ ‘సరిలేరు నీకెవ్వరు’ ఇలా వరుస విజయాలందుకున్నాడు మహేష్. కొంచెం గ్యాప్ తీసుకుని తన కుటుంబంతో విదేశాలకు వెళ్ళాడు మహేష్. తిరిగి వచ్చిన వెంటనే తన 27వ చిత్రాన్ని మొదలుపెడతాడు. ఇక తన తరువాతి సినిమాల లైనప్ చూస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే.

మహేష్ తన 27 వ చిత్రాన్ని తనకి ‘మహర్షి’ లాంటి హిట్ హిచ్చిన దర్శకుడు వంశీ పైడిపల్లితో చేయబోతున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించబోతున్నట్టు టాక్ నడుస్తుంది. ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో తన 28వ చిత్రాన్ని చేయడానికి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. గతంలో మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అతడు’ చిత్రం హిట్ అవ్వగా.. ‘ఖలేజా’ చిత్రం డిజాస్టర్ అయ్యింది. అయితే ఈ చిత్రం అండర్ రేటెడ్ అని చాలా మంది చెబుతుంటారు. మహేష్ బాబు కెరీర్లో ‘ఖలేజా’ ఓ క్లాసిక్ అని.. అలాగే ఈ చిత్రం చాలా మందికి హాట్ ఫేవరెట్ అని కూడా కామెంట్స్ వినిపిస్తూనే ఉంటాయి. దీంతో ‘మహేష్ 28’ పై అంచనాలు ఓ రేంజ్లో ఉండే అవకాశం ఉంది. ఇక ‘మహేష్ 29’ ను అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసే అవకాశం ఉందట. ఇక ‘మహేష్ 30’ .. కొరటాల శివ డైరెక్షన్లో ఉండబోతుందని తెలుస్తుంది. ఏమైనా మహేష్ లైనప్ మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి. ఇంకో విచిత్రం ఏమిటంటే.. ఈ ప్రాజెక్ట్ లను తక్కువ గ్యాప్ లోనే కంప్లీట్ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

Most Recommended Video

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus