టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ కొనసాగుతున్నారు. అఖండ సినిమా సంచలన విజయం సాధించడంలో థమన్ పాత్ర ఎంతో ఉంది. బీజీఎం లేకుండా అఖండ సినిమాను చూస్తే సినిమా పెద్దగా ఆకట్టుకోదని కామెంట్లు వినిపించాయి. అఖండ సక్సెస్ తర్వాత థమన్ కు ఆఫర్లు పెరిగాయి. సర్కారు వారి పాట సినిమాకు కూడా థమన్ మ్యూజిక్ డైరెక్టర్ అనే సంగతి తెలిసిందే. అయితే సర్కారు వారి పాట బీజీఎం విషయంలో థమన్ కు నెగిటివ్ మార్కులు పడ్డాయి.
సెకండాఫ్ లో బీజీఎం విషయంలో థమన్ మరింత శ్రద్ధ పెట్టి ఉంటే సినిమా ఫలితం మరింత మెరుగ్గా ఉండేదని కామెంట్లు వ్యక్తమయ్యాయి. అయితే థమన్ పై మహేష్ బాబు ఒకింత అసంతృప్తితో ఉన్నారని సర్కారు వారి పాట బీజీఎం విషయంలో వినిపించిన నెగిటివ్ కామెంట్లు ఇందుకు కారణమని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అయితే ఈ విషయంలో పూర్తిస్థాయిలో థమన్ ను నిందించలేమని దర్శకుడి కోరిక మేరకు థమన్ ఈ విధంగా చేసి ఉండవచ్చని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
అయితే మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీకి కూడా థమన్ మ్యూజిక్ డైరెక్టర్ అనే సంగతి తెలిసిందే. కొన్నిరోజుల క్రితం త్రివిక్రమ్ మహేష్ ను కలవడానికి జర్మనీకి వెళ్లగా అక్కడికి వెళ్లాల్సిన వాళ్ల జాబితాలో థమన్ కూడా ఉన్నారని సమాచారం. అయితే కొన్ని రీజన్స్ వల్ల చివరి నిమిషంలో థమన్ డ్రాప్ అయ్యారని తెలుస్తోంది. త్రివిక్రమ్ సినిమాలకు థమన్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుని మ్యూజిక్ ఇస్తారని ఇండస్ట్రీలో పేరుంది.
సర్కారు వారి పాట విషయంలో వినిపించిన నెగిటివ్ కామెంట్లకు చెక్ పెట్టేలా థమన్ మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీకి మ్యూజిక్ ఇస్తారేమో చూడాల్సి ఉంది. థమన్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 3 నుంచి 4 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.