Mahesh Babu: మరోసారి ఫ్యామిలీతో వెకేషన్ వెళ్లనున్న మహేష్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా గత ఏడాది షూటింగ్ పనులను ప్రారంభించుకుంది.అయితే ఏవో కొన్ని కారణాలవల్ల ఈ సినిమా షూటింగ్ తరచూ వాయిదా పడుతూనే ఉంది. ఇలా ఈ సినిమా వాయిదా పడటంతో అనుకున్న సమయానికి విడుదల అవుతుందా అన్న సందేహం కూడా అందరిలోనూ నెలకొంది. ఇకపోతే తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభమైందని తెలుస్తుంది.

ఈ షెడ్యూల్ చిత్రీకరణలో భాగంగా మహేష్ బాబుకు (Mahesh Babu) సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్టు సమాచారం.ఇలా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది అనుకునే లోపే మహేష్ బాబు మరోసారి తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్లడానికి ప్లాన్ చేశారని తెలుస్తోంది.మహేష్ బాబు ఏడాదిలో నాలుగైదు సార్లు వెకేషన్ ప్లాన్ చేస్తూ ఉంటారు ఇలా తరచూ విదేశీ పర్యటనలలో గడుపుతూ ఉంటారు.

ఈ క్రమంలోనే మరోసారి ఈయన వెకేషన్ వెళ్లబోతున్నారన్న విషయం తెలియడంతో అభిమానులు కూడా కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.మహేష్ బాబు ఇలా తరచూ షూటింగులు మాని వెకేషన్ కి వెళ్తే సినిమాలు ఆలస్యం అవుతాయని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈయన ఆగస్టు మొదటి రెండు వారాలు వెకేషన్ లో ఉండబోతున్నారని సమాచారం.ఆగస్టు 9వ తేదీ మహేష్ పుట్టిన రోజు కావడంతో తన ఫ్యామిలీతో కలిసి విదేశాలలో పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకోబోతున్నారని తెలుస్తుంది.

అలాగే ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు కూడా అందుబాటులో ఉండరు. ఇక మహేష్ బాబు వెకేషన్ వెళ్లినప్పటికీ ఈయనకు సంబంధం లేనటువంటి సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారని తెలుస్తోంది. ఈ విషయంలో మహేష్ త్రివిక్రమ్ ఇద్దరు క్లారిటీగా ఉండడంతోనే ఈయన వెకేషన్ ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus