భారీ ‘ప్లాన్’తో దూసుకొస్తున్న ప్రిన్స్!!!

టాలీవుడ్ టాప్ హీరో…..ప్రిన్స్ మహేష్ బాబు రూటు మార్చాడా?? ఇంతక ముందులాగా సినిమా చేసేందుకు రెడీగా లేడా? అంటే అవును అనే అంటున్నాయి టాలీవుడ్ సన్నిహిత వర్గాలు….విషయంలోకి వెళితే…బ్రహ్మోత్సవం సినిమాతో భారీ డిజాస్టర్ ను చవి చూసిన ప్రిన్స్…ఆ తరువాత సినిమాలను పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు….ఇప్పటివరకూ ఒక సినిమా పూర్తి అయితే కానీ….రెండో సినిమాను మొదలు పెట్టని ప్రిన్స్…ఇప్పుడు వెనువెంటనే వరుసగా….మూడు సినిమాలు చేసేస్తున్నాడు. ప్రిన్స్ సన్నిహిత వర్గాల నుంచి వినిపిస్తున్న వివరాల ప్రకారం….ఈ డిసెంబర్….2017జనవరి నాటికి ప్రిన్స్ చేస్తున్న…మురుగుదాస్ సినిమా పూర్తి కానుంది.

అయితే ఆ సినిమాని సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ చేద్దాం అని ప్లాన్ లో ఉన్నాడు ప్రిన్స్. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ కాగానే.. ఫిబ్రవరి నుంచి కొరటాలతో ‘భరత్ అను నేను’ మూవీ ని ప్రారంభించి.. మే నెలాఖరు కల్లా కంప్లీట్ చేసేస్తాడట. దీన్ని 2017 దసరా రిలీజ్ కు ప్లాన్ చేయగా.. ఆ వెంటనే జూన్ నుంచి వంశీ పైడిపల్లి మూవీ కూడా మొదలైపోనుందట. మహేష్-వంశీల మూవీ 2018 సంక్రాంతి రిలీజ్ కు ప్లాన్ చేయగా.. ఆ సమయానికల్లా త్రివిక్రమ్ తో సినిమా ప్లాన్ చేశాడు సూపర్ స్టార్. 2018 దసరా నాటికి మహేష్-త్రివిక్రమ్ శ్రీనివాస్ ల సినిమా కూడా థియేటర్లలోకి వచ్చేలా ప్లానింగ్ చేశాడట. ఇలా వరుస సినిమాలతో…పక్కా ప్లానింగ్ తో దూసుకుపోతున్నాడు మన సూపర్ స్టార్. మరి ఈ దూకుడు ఎంతవరకూ కలసి వస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus