Mahesh Babu: రాజమౌళి సినిమా మొదలయ్యేలోపు మహేష్ ఆ పనులు పూర్తి చేయనున్నారా?

మహేష్ బాబు (Mahesh Babu)  రాజమౌళి (S. S. Rajamouli) కాంబో మూవీ షూట్ మొదలు కావడానికి మరికొన్ని నెలల సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. ఈ సినిమా షూట్ 2025లో మొదలయ్యే ఛాన్స్ ఉందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. రాజమౌళి ఈ సినిమా కోసం ఎందుకు ఇంత సమయం కేటాయిస్తున్నారని కూడా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మహేష్ బాబు మాత్రం ఇప్పటికే తన లుక్ ని పూర్తిస్థాయిలో మార్చేసుకున్నారు. అయితే మహేష్ బాబు కుదిరితే త్వరలో ఫ్యాన్స్ మీట్ ఏర్పాటు చేయనున్నారని సమాచారం అందుతోంది.

Mahesh Babu

రాజమౌళి సినిమా మొదలయ్యే లోపు ఫ్యాన్స్ మీట్ దిశగా అడుగులు వేయాలని మహేష్ బాబు (Mahesh Babu) భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఫ్యాన్స్ మీట్ కచ్చితంగా ఉంటుందో లేదో మహేష్ బాబు వైపు నుంచి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. మహేష్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన యాడ్స్ ను సైతం వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నారని భోగట్టా.

రాజమౌళి మూవీ షూట్ మొదలైతే మహేష్ బాబు (Mahesh Babu) లుక్ రివీల్ కాకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. మహేష్ జక్కన్న కాంబో మూవీ టాలీవుడ్ ఇండస్ట్రీలోని బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలవాలని పాన్ వరల్డ్ స్థాయిలో సంచలన రికార్డులు క్రియేట్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూట్ మొదలుకాక ముందే ఈ సినిమాకు భారీ బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయని సమాచారం.

బాహుబలి2 (Baahubali 2) సినిమా కలెక్షన్ల రికార్డులను బ్రేక్ చేసే సినిమా ఈ సినిమా అవుతుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. మహేష్ రాజమౌళి కాంబో మూవీ ఇతర భాషల్లో సైతం రికార్డులు క్రియేట్ చేసే మూవీ అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహేష్ బాబు రాజమౌళి సినిమా పూర్తయ్యే వరకు కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ లేదని తెలుస్తోంది.

మోక్షజ్ఞ తొలి సినిమాతోనే ఆ స్థాయిలో రెస్పాన్స్ అందుకుంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus