Mahesh Babu, Rajamouli: రూ.1000 కోట్ల బడ్జెట్ కోసం.. రాజమౌళి మామూలోడు కాదు!

మహేష్ బాబు (Mahesh Babu) – ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) కలయికలో ఓ భారీ బడ్జెట్ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టుని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ మరోపక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్ ముమ్మరంగా జరుగుతుంది. ముంబైలో రాజమౌళి నటీనటుల ఎంపిక నిర్వహిస్తున్నారు.అలాగే టెస్ట్ షూట్స్ కూడా జరుగుతున్నట్లు సమాచారం. ‘శ్రీ దుర్గా ఆర్ట్స్’ బ్యానర్ పై కె.ఎల్.నారాయణ్ (K.L.Narayana) ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ‘పోకిరి’ (Pokiri) టైంలోనే రాజమౌళి- మహేష్..ల ప్రాజెక్టుకి ఈయన అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకోవడం జరిగింది.

ఇప్పుడు ఆయన్ని ప్రాజెక్టు నుండి తప్పుకుంటే వందల కోట్లు ఇస్తామనే ఆఫర్లు కూడా వస్తున్నట్టు వినికిడి. ఇదిలా ఉండగా.. ఈ సినిమా అధికారిక ప్రకటన కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ (Krishna) గారి జయంతి రోజున అప్డేట్ ఉంటుందేమో అని ఆశపడ్డారు. కానీ ఎటువంటి అప్డేట్ రాలేదు. మరోపక్క మహేష్ బాబు పుట్టినరోజు అయిన ఆగస్టు 9న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్ వస్తుందేమో అని ఆశపడ్డారు. కానీ అది కూడా కష్టంగానే కనిపిస్తుంది.

ఇదిలా ఉంటే.. మహేష్- రాజమౌళి..ల ప్రాజెక్టు కోసం రూ.1000 కోట్లు బడ్జెట్ అవుతుందట. అంత మొత్తం రికవరీ చేయాలంటే కొంచెం కష్టమే. అందుకే ఈ సినిమాని రెండు పార్టులుగా రిలీజ్ చేయాలని రాజమౌళి భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు 3వ పార్టుకి కూడా ఛాన్స్ ఉండొచ్చని ఇన్సైడ్ టాక్. ముందుగా అనౌన్స్మెంట్ కోసమైతే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus