Mahesh Babu, Rajamouli: మహేష్‌ – రాజమౌళి సినిమా… కొబ్బరికాయ కొట్టడానికి ఏంటి ఇబ్బంది?

  • June 7, 2024 / 08:51 PM IST

కొన్నేళ్ల క్రితం అనౌన్స్‌ చేసిన సినిమా.. ఇదిగో అదిగో అంటూ గత కొన్ని నెలలుగా వినిపిస్తున్న సినిమా. ఈ రెండు మాటలు చెప్పగానే అది మహేష్‌బాబు (Mahesh Babu)  – రాజమౌళి (S. S. Rajamouli) ప్రాజెక్ట్‌ గురించే అని మీరు గుర్తు పట్టేస్తారు. మరీ మహేష్ – రాజమౌళి సినమాల లైనప్‌ను పట్టించుకోని వాళ్లు అయితే గుర్తుపట్టలేరు లెండి. ఇక అసలు విషయానికొస్తే అసలు ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుంది, కనీసం ఎప్పుడు కొబ్బరికాయ కొడతారు అనేదే ఇక్కడ పాయింట్‌.

ఎందుకంటే మహేష్ ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) , రాజమౌళి ‘ఆర్ఆర్‌ఆర్‌’ (RRR) వచ్చి చాలా నెలలు అయింది. ఇద్దరూ కలసి పని చేస్తారనే పుకార్లకు ఫుల్‌ స్టాప్‌ పెట్టేస్తూ టీమ్‌ అనౌన్స్‌మెంట్లు కూడా చేశారు. అయితే ఇంకా సినిమాకు కొబ్బరికాయ కొట్టలేదు. షూటింగ్‌ ప్రారంభించలేదు అంటే దానికి ఏవేవో కారణలు ఉండొచ్చు. లుక్‌, కథ, స్క్రీన్‌ప్లే, సెట్స్‌, షూటింగ్‌ లొకేషన్స్‌, ఆర్టిస్ట్‌లు, టెక్నికల్‌ క్రూ ఇలా చాలా విషయాల ప్రభావం షూటింగ్‌ మీద ఉంటుంది.

అయితే, ఇక్కడ ప్రశ్న సినిమా ముహూర్తపు షాట్‌ ఎందుకు ఇంకా అవ్వలేదు అని. పోనీ సినిమా ముహూర్తపు షాట్‌కి మహేష్‌ ఏమన్నా హాజరవుతాడా.. లుక్‌ లీక్‌ అయిపోవడానికి అంటే.. అలాంటి కార్యక్రమాలకు మహేష్‌ అస్సలు హాజరు కాడు. తొలి నాళ్లలో ఏమో కానీ.. ఇటీవల కాలంలో కొబ్బరికాయ కొట్టే కార్యక్రమానికి మహేష్‌ హాజరవ్వడం లేదు. కాబట్టి ఆ సమస్య కూడా లేదు. మరి బడ్జెట్టా అంటే రాజమౌళి సినిమాకు బడ్జెట్‌ అనే సమస్యే ఉండదు. దీంతో కారణం ఏంటా అని చూస్తే.. కొన్ని కనిపిస్తున్నాయి.

ఈ సినిమాను తొలుత అనుకున్నట్లుగా కాకుండా రాజమౌళి రెండు పార్టులుగా తీయాలని అనుకుంటున్నారట. అందుకే కథను ఎక్స్‌పాండ్‌ చేసే పనిలో ఉన్నారట. మరోవైపు ఈ కథ కోసం మహేష్‌ మేకోవర్‌ చాలా జరగాల్సి ఉందట. దీనికి కనీసం మరో మూడు నెలలు పడుతుంది అంటున్నారు. అందుకే ఇప్పుడే కొబ్బరికాయ కొట్టి వెయిట్‌ చేయడం ఎందుకు? అప్పుడు చూసుకుందాం అని అనుకుంటున్నారట.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus