ఆ డైరెక్టర్ కు మహేష్ నో చెబితే.. ఎన్టీఆర్ ఓకే చెప్పాడట..!

మహేష్ బాబు, ఎన్టీఆర్… ఇద్దరూ టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ హీరోలు. వీళ్ళిద్దరూ మంచి సన్నిహితులు కూడా.! అన్నదమ్ములు లానే కలిసుంటారు. మహేష్ ను తారక్.. అన్నయ్య అని పిలిస్తుంటాడు. ఇక తారక్ ను మహేష్.. తమ్ముడు అని పిలుస్తుంటాడు. వీరి అనుబంధం ఎలా ఉంటుందో.. మనం ‘భరత్ అనే నేను’ ప్రీ రిలీజ్ వేడుకలో చూసాం. రాంచరణ్ కూడా వీళ్ళిద్దరితో బాగా కలిసి ఉంటాడు. ఇప్పుడు చరణ్ తో కలిసి ‘ఆర్.ఆర్.ఆర్’ అనే భారీ మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్.. ఆ తరువాత మహేష్ తో కూడా ఓ మల్టీ స్టారర్ సినిమా చెయ్యడానికి ఓకే చెప్పాడనే ప్రచారం జరుగుతుంది.

ఈ కాంబినేషన్ ను సెట్ చెయ్యడానికి టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చాలా గట్టిగా ట్రై చేస్తున్నారని కూడా వినికిడి. ఇదిలా ఉండగా.. ‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తైన తరువాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా చెయ్యబోతున్నాడు. ఆ తరువాత కె.జి.ఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సినిమా చెయ్యడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్ట్ ను ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మించనుంది. నిజానికి ఈ స్క్రిప్ట్ ను ప్రశాంత్ నీల్…

ఎన్టీఆర్ కంటే ముందు మహేష్ బాబు కు అలాగే నిర్మాత అల్లు అరవింద్ కు వినిపించాడట. కానీ వాళ్ళిద్దరూ ఈ స్క్రిప్ట్ ను రిజెక్ట్ చేశారట. తరువాత ఎన్టీఆర్ కు వినిపిస్తే.. ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. మహేష్ బాబు లాంటి ఓ స్టార్ హీరో అలాగే అల్లు అరవింద్ వంటి స్టార్ ప్రొడ్యూసర్ రిజెక్ట్ చేసిన ప్రాజెక్ట్ ను ఎన్టీఆర్ చెయ్యడం రిస్కేమో అనే డిస్కషన్… ప్రస్తుతం ఫిలింవర్గాల్లో జోరుగా జరుగుతుంది.

Most Recommended Video

40 ఏళ్ళ వయసొచ్చినా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్స్..!
విడాకులతో కోట్లకు పడగెత్తిన సెలెబ్రిటీలు!
ఈ సూపర్ హిట్లను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus