Mahesh Babu: మహేష్ రెమ్యునరేషన్ తగ్గించుకుని హిట్ కొట్టిన సినిమా ఏదో తెలుసా?

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) రెమ్యునరేషన్ పరంగా టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే. 100 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకునే హీరోల జాబితాలో మహేష్ బాబు కూడా నిలిచారు. మహేష్ బాబు కెరీర్ లో హిట్ సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. మహేష్ సినిమాకు పాజిటివ్ టాక్ సొంతమైతే సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (Seethamma Vakitlo Sirimalle Chettu) సినిమా కోసం మహేష్ బాబు, వెంకటేశ్ (Venkatesh Daggubati) తమ పారితోషికాలు తగ్గించుకుని నటించారట.

సాధారణంగా తీసుకునే స్థాయిలో పారితోషికం తీసుకుంటే బడ్జెట్ పెరిగే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో మహేష్, వెంకటేశ్ నిర్మాతలకు బెనిఫిట్ కలిగేలా అలా చేశారు. ఈ ఇద్దరు హీరోలను ఎంత ప్రశంసించినా తక్కువేనని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేశారు. మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి (Rajamouli) సినిమాకు అనుగుణంగా లుక్స్ మార్చుకునే పనిలో ఉన్నారు. షూటింగ్ ఆలస్యమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం మహేశ్ బాబు విదేశాల్లో ఉన్నారు.

త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. ఉగాది కానుకగా ఎలాంటి అప్ డేట్ రాని పక్షంలో మహేష్ పుట్టినరోజున ఈ సినిమాకు సంబంధించి పూర్తి అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. రాజమౌళి సైతం మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అప్ డేట్ అవుతూ టెక్నికల్ గా ఈ సినిమా స్థాయి మరో లెవెల్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

రాజమౌళి వేగంగా సినిమాలను తెరకెక్కిస్తే టాలీవుడ్ ఇండస్ట్రీకి మరింత మంచిపేరు వచ్చే ఛాన్స్ ఉంది. జక్కన్న మహేష్ మూవీ కథ, కథనం విషయంలో ఎన్నో మార్పులు చేస్తున్నారని భోగట్టా. మహేష్ తో జక్కన్న తెరకెక్కించే సినిమా 5000 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus