Mahesh Babu: ‘ఆర్ఆర్ఆర్’ మూవీ పై మహేష్ బాబు కామెంట్స్..!

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నిన్న విడుదలై హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. కొంతమంది ఈ మూవీకి మిక్స్డ్ టాక్ చెబుతున్నప్పటికీ రాజమౌళి సినిమా పై నమ్మకం, అభిమానం ఉన్న వాళ్ళు మాత్రం ఈ మూవీ చూడడానికి ఎగబడుతున్నారు. తొలి రోజు ఈ చిత్రం భారీ వసూళ్ళను సాధించి ‘బాహుబలి’ నెలకొల్పిన రికార్డులను ‘ఆర్.ఆర్.ఆర్’ బ్రేక్ చేసింది. బాలీవుడ్ మీడియా కుళ్ళుకునేలా ఉన్నాయి ‘ఆర్.ఆర్.ఆర్’ ఓపెనింగ్స్. ఇక ఈ చిత్రం పై సెలబ్రిటీలు సైతం ప్రశంసలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే.

Click Here To Watch NOW

చిరంజీవి, అల్లు అర్జున్ వంటి వారు ఈ మూవీ అద్భుతం అంటూ కొనియాడారు. తెలుగు సినిమా స్థాయిని ఇంకో మెట్టు పైకి ఎక్కించినందుకు రాజమౌళికి వాళ్ళు స్పెషల్ థాంక్స్ చెప్పారు. తాజాగా మహేష్ బాబు కూడా ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాని చూసి తన అభిప్రాయాన్ని ట్విట్టర్లో పంచుకున్నారు. మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. “ఒకప్పుడు మనకి సినిమాలు ఉన్నాయి అని చెప్పుకోవడానికి సంతోషించే వాళ్ళం… ఇప్పుడు మనకి ఎస్.ఎస్.రాజమౌళి సినిమాలు ఉన్నాయి అంటూ గర్వంగా చెప్పుకుంటున్నాం.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ మరో ఎపిక్! ఈ మూవీ స్కేల్, గ్రాండియర్ విజువల్స్, మ్యూజిక్ & ఎమోషన్స్ అనూహ్యమైనవి, ఉత్కంఠభరితమైనవి మరియు అద్భుతమైనవి. రాంచరణ్, ఎన్టీఆర్ తమ స్టార్ డం ను పక్కన పెట్టి మరీ ఇలాంటి గొప్ప సినిమా చేసినందుకు స్పెషల్ థాంక్స్ చెప్పుకోవాలి. వాళ్ళ నటన ‘అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్’. నాటు నాటు సాంగ్ చూస్తుంటే గాల్లో తేలిపోతున్న ఫీలింగ్. ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి గొప్ప సినిమా కోసం పని చేసిన వాళ్ళందరికీ కంగ్రాట్యులేషన్స్. మీరు ఎంతో గర్వకారణం” అంటూ మహేష్ బాబు చెప్పుకొచ్చాడు.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags