Mahesh: సుహాస్ ‘రైటర్ పద్మభూషణ్’ సినిమా చూసి మహేష్ బాబు చేసిన పోస్ట్ వైరల్..

కంటెట్ నచ్చితే చిన్నా, పెద్దా అనే తేడా చూడకుండా సినిమాలను ఆదరిస్తారు తెలుగు ప్రేక్షకులు.. ఈ విషయం ఎన్నోసార్లు నూటికి నూరు శాతం నిజమని నిరూపితమైంది. గతేడాది కూడా చాలా చిన్న సినిమాలు బాక్సాఫీస్ బరిలో సత్తా చాటాయి. తాజాగా విడుదలైన యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ ‘రైటర్ పద్మభూషణ్’ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. మౌత్ టాక్‌తో మంచి కలెక్షన్లు రాబడుతోంది.. సినిమా చూసి సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు.

టీంకి కంగ్రాట్స్ చెప్తూ, ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన చిత్రమిది అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీతో పాటు ఓ ట్వీట్ చేశారు మహేష్.. విజయవాడకు చెందిన సుహాస్.. యూట్యూబ్ ఛానల్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేశాడు. నాగ చైతన్య ‘దోచెయ్’, ‘మజిలీ’, ‘పడి పడి లేచే మనసు’; ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’, ‘డియర్ కామ్రేడ్’, ‘ప్రతిరోజు పండగే’ వంటి పలు చిత్రాల్లో చిన్న చిన్న రోల్స్ చేసి ఆకట్టుకున్నాడు. ఇక సోలో హీరోగా ‘కలర్ ఫోటో’ తో సత్తా చాటాడు. నేచురల్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను అలరించాడు.

తన వాయిస్ కూడా బాగా ప్లస్ అయింది. సైడ్ క్యారెక్టర్ల నుండి స్టార్‌గా ఎదగడానికి మంచి పునాదిగా నిలిచే సినిమాలు సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇటీవల అడివి శేష్ ‘హిట్ 2’ లో నెగిటివ్ క్యారెక్టర్ చేసి మెప్పించాడు. ఇప్పుడు ‘రైటర్ పద్మభూషణ్’ తో హీరోగా మరో హిట్ అందుకున్నాడు. ‘‘సుహాస్ సహజమైన నటన ఆకట్టుకుంటుంది.. కామెడీ, ఎమోషన్ ఏదైనా చాలా బాగా చేస్తున్నాడు’’ అంటూ ఆడియన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఇక మహేష్ ఈ చిత్రం చూసి స్పందించారు..

‘‘సినిమా చూస్తున్నంతసేపు చాలా ఎంజాయ్ చేశాను.. ‘రైటర్ పద్మభూషణ్’ క్లైమాక్స్ చాలా అద్భుతంగా అనిపించింది.. తప్పకుండా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఇది.. సుహాస్ పర్ఫార్మెన్స్ నటన బాగుంది.. ఇంత భారీ విజయం సాధించి డైరెక్టర్ ప్రశాంత్ షణ్ముఖ్, నిర్మాతలు అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర.. మూవీ టీంకి అందరికీ కంగ్రాచ్యులేషన్స్’’ అంటూ మహేష్ మూవీ యూనిట్‌ని అభినందించారు..

స్వయంగా సూపర్ స్టార్ ఓ చిన్న సినిమాకి ఇంతలా సపోర్ట్ చేయడం ఆయన మంచి మనసుకి నిదర్శనం అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. సుహాస్, తాను మహేష్ బాబుకి వీరాభిమాని అని చెప్పాడు.. ఇప్పుడు ఏకంగా తన అభిమాన నటుడే తన సినిమాని అభినందించడంతో సుహాస్ సంతోషానికి ఆకాశమే హద్దు అన్నట్లు అయ్యింది..

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus