చిరంజీవితో తన నిర్ణయం చెప్పిన మహేష్ బాబు

తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో నిధుల సేకరణ విషయంలో అవకతవకలు జరిగినట్లు కొద్దిరోజులుగా ఆరోపణలు వస్తున్నాయి. ‘మా’కి సొంత భవనం కట్టించాలన్న ఆలోచనతో మెగాస్టార్ చిరంజీవితో విదేశాల్లో సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వహించారు. ఈ ఈవెంట్ ద్వారా ‘మా’కి కోటి రూపాయల నిధులు సమకూరింది. ఈ కోటి రూపాయలు కాకుండా అదనంగా కొంత డబ్బు అసోసియేషన్‌కు చెందిన బినామీ అకౌంట్‌లోకి చేరినట్లు ఆరోపిస్తున్నారు. ఈ గొడవని కాసేపు పక్కన పెడితే “మా” వారు నెక్స్ట్ ఏర్పాటు చేయబోయే ఫండ్ రైజింగ్ ఈవెంట్ లో మహేష్ బాబు పాల్గొనాల్సి ఉంది. ఈ ఈవెంట్ ద్వారా వచ్చే ఫండ్స్ తో అసోసియేషన్ బిల్డింగ్ కట్టాలని భావిస్తున్నారు.

దీంతో ఈ ఈవెంట్స్ సజావుగా జరగడం చాలా ముఖ్యం. ఈ వివాదాల కారణంగా మహేష్ బాబు ఈవెంట్ నుండి వైదొలగే ఆలోచనలో ఉన్నాడని వార్తలు వచ్చాయి. దీంతో మహేష్ స్వయంగా చిరంజీవి కి ఫోన్ చేసి ఈవెంట్ లో తప్పనిసరిగా పాల్గొంటానని చెప్పినట్టు సమాచారం. ఈ వివాదం సద్దుమణిగిన తర్వాత ఈవెంట్ డేట్ ఫైనలైజ్ చేసినప్పుడు తనవైపు నుంచి సహకారం అందిస్తానని క్లారిటీ ఇచ్చాడని తెలిసింది. సమస్య పరిష్కారం దిశగా చొరవ చూపడంతో చిరు మహేష్ ను ప్రశంసించినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. ప్రస్తుతం చిరు సైరా షూటింగ్ లో, మహేష్ మహర్షి షూటింగ్ విషయంలో బిజీగా ఉన్నప్పటికీ పరిశ్రమ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుండడం అభినందనీయం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus