రామ్ చరణ్ తేజ్ రిక్వెస్ట్ కి ఓకే చెప్పిన మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే అభిమానులకే కాదు. సినీ పరిశ్రమలోని చాలా మందికి ఇష్టం. పెద్ద స్టార్ అయినప్పటికీ ప్రతి ఒక్కరితో స్నేహంగా ఉండడం అతని నైజం. ఈ మధ్య రామ్ చరణ్, ఎన్టీఆర్ తో కలిసి వేడుకలకు హాజరవుతున్న ఫోటోలు ఆ విషయాన్ని స్పష్టం చేశారు. మెగాస్టార్ కూడా మహేష్ తో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఆ స్నేహంతోనే రాజమౌళి బాహుబలి ది బిగినింగ్ సినిమా కోసం మహేష్ సినిమాని వాయిదా వేసుకోమనగానే.. ప్రభాస్ కోసం ఇరవై రోజులు ఆలస్యంగా శ్రీమంతుడు సినిమాని రిలీజ్ చేశారు. బాహుబలి ది బిగినింగ్ సినిమా జూలై 10, 2015న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలైన వారానికే అంటే జూలై 17న మహేష్ శ్రీమంతుడు సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ రాజమౌళి రిక్వెస్ట్ చేశారనే కారణంగా మహేష్ తన సినిమాని ఆగస్టు 7 న రిలీజ్ చేశారు.

ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమా కోసం మరోసారి తన సినిమాను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. భరత్ అనే నేను సినిమా తర్వాత వంశీ పైడిపల్లి డైరెక్షన్‌ మహర్షి అనే సినిమాని మహేష్ బాబు చేస్తున్నారు. దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ కలిపి నిర్మిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేయాలని చిత్రబృందం అనుకుంది. అయితే అదే సమయంలో సైరాను కూడా రిలీజ్ చేయాలని రామ్ చరణ్ భావిస్తున్నారు. దీంతో మహర్షి సినిమా రిలీజ్ డేట్‌ను మార్చుకోమని మహేష్‌ను చరణ్ కోరినట్టుగా, అందుకు మహేష్ ఓకే చెప్పినట్టుగా ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. మరి సైరాకి, మహర్షికి మధ్య ఎన్ని రోజులు తేడా ఉంటుందో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus