Gautam: కొడుకును చూసి మురిసిపోతున్న మహేష్ ..?

సూపర్ స్టార్ మహేష్ బాబు వరుసగా సక్సెస్ లను సొంతం చేసుకుంటూ సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేకతను చాటుకుంటున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు కొడుకు గౌతమ్ ప్రేక్షకులకు ఇప్పటికే సుపరిచితం. సుకుమార్ డైరెక్షన్ లో మహేష్ హీరోగా తెరకెక్కిన 1 నేనొక్కడినే సినిమాలో గౌతమ్ నటించగా ఆ సినిమాలో గౌతమ్ నటనకు ప్రశంసలు వచ్చాయి. అయితే తాజాగా గౌతమ్ మహేష్ బాబు గర్వపడే పని చేశారు. తండ్రికి తగ్గ తనయుడని గౌతమ్ ప్రూవ్ చేసుకున్నారు. సినిమా విజయం సాధించడం కోసం మహేష్ చాలా కష్టపడతారనే సంగతి తెలిసిందే.

దర్శకుడు చెప్పిన సీన్ కు పూర్తి న్యాయం జరిగే వరకు మహేష్ అస్సలు ఊరుకోరు. మహేష్ లక్షణాలనే పుణికిపుచ్చుకున్న గౌతమ్ తెలంగాణ స్టేట్ స్విమ్మింగ్‌ పోటీలో టాప్ 8 ఈతగాళ్ల జాబితాలో స్థానం సంపాదించుకున్నారు. గౌతమ్ సాధించిన ఘనత గురించి తెలిసి మహేష్ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. కేవలం 15 సంవత్సరాల వయస్సులోనే గౌతమ్ ఈ ఘనతను సాధించడం గమనార్హం. ఈ విషయం తెలిసి మహేష్, నమ్రత మురిసిపోతున్నారు.

మహేష్ సతీమణి నమ్రత గౌతమ్ సక్సెస్ ను అభిమానులతో పంచుకోవడంతో పాటు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. గౌతమ్ కేవలం మూడు గంటల్లో 5 కిలోమీటర్ల దూరాన్ని ఈదగలడని ఆమె తెలిపారు. నాలుగు వేర్వేరు పద్ధతులలో గౌతమ్ స్విమ్మింగ్ చేస్తాడని నమ్రత వెల్లడించారు. భవిష్యత్తులో గౌతమ్ సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి నటుడిగా కూడా సక్సెస్ ను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.


Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus