Gautham Education: మహేష్ కొడుకు ఆ యూనివర్సిటీలో చదవబోతున్నారా.. ఏమైందంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. గుంటూరు కారం మూవీ రిలీజ్ కు మరో మూడు వారాల సమయం మాత్రమే ఉండగా తల్లీ కొడుకుల ఎమోషన్ తో తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. త్వరలో ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ కానుండగా ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మహేష్ కొడుకు గౌతమ్ హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే గౌతమ్ ఉన్నత చదువుల కోసం న్యూయార్క్ యూనివర్సిటీకి చదువుకోవడానికి వెళుతున్నాడని నమ్రత సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. గౌతమ్ న్యూయార్క్ యూనివర్సిటీలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టబోతున్నాడని గౌతమ్ హార్డ్ వర్క్, ఫ్యాషన్ చూస్తుంటే నాకు గర్వంగా ఉందని ఆమె తెలిపారు.

నువ్వు కెరీర్ పరంగా మరింత ఎదగాలంటూ నమ్రత గౌతమ్ టాలెంట్ ను ప్రశంసించారు. నమ్రత షేర్ చేసిన ఈ పోస్ట్ కు దాదాపుగా 83 వేల లైక్స్ వచ్చాయి. గౌతమ్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదగాలని చదువులో కూడా సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. గౌతమ్ ఘట్టమనేనికి సోషల్ మీడియాలో 3 లక్షల కంటే ఎక్కువగా ఫాలోవర్లు ఉన్నారు. గౌతమ్ సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తారో చూడాలి.

గౌతమ్ ను (Gautham) అభిమానించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మహేష్ బాబు గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి విజయం సాధించగా గుంటూరు కారం, జక్కన్న సినిమాలతో మహేష్ డబుల్ హ్యాట్రిక్ సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది. మహేష్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా ఈ స్టార్ హీరోతో సినిమాలు చేయడానికి కొంతమంది స్టార్ డైరెక్టర్లు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. మహేష్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus