Mahesh Babu Son: హీరోగా గౌతమ్ ఎంట్రీపై మరో క్లారిటీ వచ్చేసింది!

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు ఎంతో కష్టపడి తన స్టార్ హోదాను పెంచుకున్నాడు. మాస్ క్లాస్ అభిమానులను చాలా ఈక్వల్ గా పెంచుకున్న ఈ స్టార్ నటుడు ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో కూడా సినిమాలు చేసేందుకు సిద్ధమయ్యాడు. అయితే మహేష్ బాబు వారసుడు కూడా ఇండస్ట్రీలో హీరోగా కెరీర్ ను స్టార్ట్ చేస్తాడని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి.

Click Here To Watch

అయితే ఇటీవల మహేష్ బాబు ఆ విషయంలో ఒక క్లారిటీ అయితే ఇచ్చేశాడు. ఇటీవల నందమూరి బాలకృష్ణ అన్ స్థాపబుల్ షోలో పాల్గొన్న మహేష్ బాబు తన సినిమా కెరీర్ గురించి అలాగే తన పర్సనల్ లైఫ్ విషయాలను కూడా బయటపెట్టారు. ముఖ్యంగా తన లైఫ్ లో ఫ్యామిలీ అనేది చాలా ముఖ్యం అని వారితో ఎక్కువగా సమయాన్ని గడిపేందుకు ఇష్టపడతాను అని అన్నాడు. ఇక గౌతమ్‌ క్యాట్‌, సితార బ్రాట్‌ అని బాలయ్యతో చెప్పిన మహేష్ ఆ తరువాత కూడా వారికి నచ్చిన విధంగానే కెరీర్ ఉంటుందని ఒక హింట్ అయితే ఇచ్చారు.

గౌతమ్ ఘట్టమనేని ఇప్పటికే ఒకసారి బిగ్ స్క్రీన్ పై కనిపించిన విషయం తెలిసిందే. మహేష్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 1 నేనొక్కడినే సినిమాలో చిన్నప్పటి మహేష్ గా కనిపించిన విషయం తెలిసిందే. ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికి గౌతమ్ చేసిన పాత్రకు మాత్రం మంచి గుర్తింపు లభించింది. ఏదేమైనా గౌతమ్ మాత్రం తన నటనతో మెప్పించడంతో అతను భవిష్యత్తులో హీరోగా ఎంట్రీ ఇస్తాడాని అర్ధమయ్యింది. అయితే ఆ తరువాత మాత్రం గౌతమ్ కు మంచి అవకాశాలు వచ్చినప్పటికీ నటన వైపు కొనసాగలేదు.

ఎక్కువగా చదువు పైనే ఫోకస్ పెట్టాడు. ఇక మొత్తానికి మహేష్ అయితే మరోసారి గౌతమ్ హీరోగా వస్తాడని హింట్ ఇచ్చాడు. మరి గౌతమ్ ఎప్పుడు వెండితెరపై విజిల్స్ వెయిస్తాడో చూడాలి.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus