అప్పట్లో కొన్ని కాంబినేషన్స్ ని ప్రేక్షకులు చాలా పర్సనల్ గా తీసుకునేవారు. ముఖ్యంగా తండ్రి సరసన నటించిన హీరోయిన్లు కొడుకుల సరసన నటించడాన్ని అస్సలు యాక్సెప్ట్ చేసేవారు కాదు. ఉదాహరణకి నాగేశ్వరరావు సరసన హీరోయిన్ గా నటించిన శ్రీదేవి… నాగార్జున సరసన ‘ఆఖరి పోరాటం’ ‘గోవిందా గోవిందా’ సినిమాల్లో నటించింది. అది ప్రేక్షకులకి నచ్చలేదు. ‘ఆఖరి పోరాటం’ కొంత హైప్ వల్ల కమర్షియల్ గా వర్కౌట్ అయ్యింది. కానీ ‘గోవిందా గోవిందా’ సినిమా మొదటిరోజే దుకాణం సర్దేసింది.
ఆ సినిమా వల్ల చాలా డబ్బులు పోయాయని నిర్మాత అశ్వినీదత్ చాలా సార్లు చెప్పుకొచ్చారు. ఇప్పుడైతే అలాంటి సెంటిమెంట్లను జనాలు పట్టించుకోవడం లేదు. కాకపోతే ఇప్పుడు స్టార్ హీరోల కొడుకులతో సినిమాలు చేసిన తర్వాత తండ్రి సినిమాల్లో హీరోయిన్లుగా నటిస్తున్నారు తమన్నా, కాజల్ వంటి వారు..! ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. సూపర్ స్టార్ కృష్ణ సరసన సౌందర్య అనేక హిట్ సినిమాల్లో నటించారు. అలాగే ‘రవన్న’ అనే సినిమాలో అన్నా చెల్లెళ్లుగా కూడా కలిసి నటించారు.
అయితే కృష్ణ చిన్న కొడుకు మహేష్ బాబు నటించిన ఓ సినిమాలో కూడా సౌందర్య హీరోయిన్ గా నటించాల్సి వచ్చిందట. కానీ షూటింగ్ మొదలయ్యాక ఆమె తప్పుకుంది. ఆ సినిమా మరేదో కాదు ‘యువరాజు’. ఈ సినిమాలో సిమ్రాన్, సాక్షి శివానంద్..లు హీరోయిన్లుగా నటించారు. వీళ్ళిద్దరూ కూడా మహేష్ సరసన సెట్ అవ్వలేదు అనే కామెంట్స్ అప్పట్లో వినిపించాయి. అయితే వాస్తవానికి సిమ్రాన్ స్థానంలో సౌందర్య చేయాలట.
దర్శకుడు వైవిఎస్ చౌదరి ముందుగా ఆమెనే హీరోయిన్ గా ఎంపిక చేశారు. కానీ (Mahesh) ‘మహేష్ పక్కన నేను అక్కలా ఉన్నాను.. మా పెయిర్ బాగోలేదు’ అని స్వయంగా సౌందర్యనే చెప్పి తప్పుకుందట. ఏమైనా ఈ కాంబినేషన్ మిస్ అవ్వడమే మంచిదైంది. లేదంటే సౌందర్య- మహేష్ ల జోడీ వల్ల సినిమాకి ఎక్కువ డ్యామేజ్ జరిగుండేది. అయినప్పటికీ ఇది యావరేజ్ సినిమానే..!
మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!
కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!