Mahesh Babu: అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్ మహేష్ వేసుకొచ్చిన టీ- షర్ట్ ధర ఎంతో తెలుసా?

నిన్న అఖిల్ (Akhil Akkineni)  – జైనబ్..ల రిసెప్షన్ ను నిర్వహించారు నాగార్జున (Nagarjuna)  అండ్ ఫ్యామిలీ. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ వేడుక జరిగింది. ఈ వేడుకకు చాలా మంది స్టార్స్ విచ్చేసి నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇలాంటి వేడుకలకి కనుక మహేష్ బాబు (Mahesh Babu)  వెళ్ళాడు అంటే చాలు.. అక్కడ అతని డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. తన లుక్స్ తో మెస్మరైజ్ చేసేసి హాట్ టాపిక్ అవుతుంటాడు మహేష్ బాబు. అంబానీ కొడుకు పెళ్ళిలో..

Mahesh Babu

చాలా మంది బాలీవుడ్ స్టార్లు సందడి చేసినప్పటికీ.. మహేష్ బాబు గురించే అక్కడి మీడియా ఎక్కువగా మాట్లాడుకుంది. అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్ లో కూడా అంతే..! మహేష్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. రాజమౌళి సినిమా కోసం మహేష్ డిఫరెంట్ లుక్ మెయింటైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక డ్రెస్సింగ్ కూడా అదిరింది. బ్లాక్ ఔట్ఫిట్స్ చాలా అందంగా కనిపించాడు మహేష్. సింపుల్ గా ఒక టీ- షర్ట్ మాత్రమే వేసుకొచ్చాడు.

కానీ ఆ టీ- షర్ట్ ఖరీదు తెలిస్తే.. ఎవ్వరైనా షాక్ కి గురవ్వడం ఖాయం. అందుతున్న సమాచారం ప్రకారం ఈ టీ- షర్ట్ ధర అక్షరాలా రూ.1.51 లక్షలు అని తెలుస్తుంది. సామాన్యుల నెల సంపాదన కూడా అంత ఉండదు. కాబట్టి.. ఇది ఎక్కువమందికి షాకిచ్చే ప్రైజ్ అని స్పష్టమవుతుంది. మహేష్ బాబు ఒక్కో సినిమాకు రూ.70 కోట్లు పారితోషికం అందుకుంటాడు. కాబట్టి ఈ రేంజ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం అనేది పెద్ద విడ్డూరం ఏమీ కాదు.

 కామెంట్లు ఇబ్బంది పెట్టాయా? కామెంట్లు పడ్డొళ్లతో ఎందుకు అనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus