తెలుగు చిత్రపరిశ్రమకి అంకితమైన సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఆలోచనను మార్చుకున్నారు. ఇతర భాషల్లోనూ పాతుకుపోవాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఏఆర్ మురుగదాస్ తో ద్విభాషా చిత్రం చేస్తున్నారు. ఈ మూవీ ద్వారా కోలీవుడ్ లో ప్రిన్స్ అడుగుపెట్టబోతున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ దాదాపు పూర్తికావచ్చింది. జూన్ 23 న రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని మళయాలం లోకి డబ్ చేయమని మహేష్ చెప్పినట్లు తెలిసింది. తెలుగు, తమిళంలో విడుదలయిన రోజే మలయాళంలోనూ రిలీజ్ చేయడానికి నిర్మాతలు రెడీ అవుతున్నారు.
శాండిల్ వుడ్ లో డబ్బింగ్ చిత్రాలకు అనుమతి లేదు కాబట్టి, ఆ భాషను పక్కన పెట్టారు కానీ అక్కడ కూడా ఇదే మూవీతో మహేష్ రంగంలోకి దిగేవారు. అయినా తెలుగు, తమిళ రెండు వెర్షన్స్ అక్కడి థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. ఇన్వెస్ట్ గేషన్ ఆఫీసర్ గా మహేష్ నటిస్తున్న ఇందులో ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా అందాలు ఆరబోయనుంది. జాతీయ అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ పనిచేస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.