Mahesh: త్వరలో తల్లి కోరికను తీర్చునున్న మహేష్ బాబు ..!

తండ్రి నటనను పునికి పుచ్చుకుని టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎదిగారు మహేష్ బాబు. తాను ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఆయన చాలా సెంటిమెంట్స్ ను బలంగా నమ్ముతూ వాటిని ఫాలో అవుతూ ఉంటారు. మరి ముఖ్యంగా తన లైఫ్లో కొన్ని ముహూర్తాలు.. కొన్ని డేస్ బాగా ఫాలో అవుతుంటారు. అయితే అలాంటి మహేష్ తన తల్లి ఆఖరి కోరికను తీర్చలేకపోయాడన్న వార్త ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి అనారోగ్య కారణంగా కొన్నెళ్ల క్రితం కన్నుమూశారు. అయితే ఆమె బతికున్న సమయంలో సితారకు ఓణీల ఫంక్షన్ చేయించాలని చాలా ఆశపడిందట. మొదటి నుంచి ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉండే మహేశ్.. ఇంట్రెస్ట్ లేకపోవడంతో ఇప్పుడప్పుడే ఎందుకని దాటేసుకుంటూ వచ్చారట. ఇలా తన తల్లి ఆ కోరిక తీరకుండానే చనిపోయింది. దీంతో చనిపోయిన తన తల్లి కోరిక తీర్చేందుకు మహేష్ బాబు (Mahesh) సితార ఓణీల ఫంక్షన్ చేసేందుకు అంగీకరించారట.

తన భార్య నమ్రతతో కూర్చుని ఫంక్షన్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అందుకు కావాల్సిన ఏర్పాట్లు చూసుకోమన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నవంబర్ లో ఘట్టమనేని ఇంట మొదటి శుభకార్యం జరగబోతున్నట్లు మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. సితార ఘట్టమనేని కు న భూతో న భవిష్యత్ అనేలా ఓణీల ఫంక్షన్ జరిపించబోతున్నారట. ఈ ఫంక్షన్ కు అతిరథమహారథులను అందరినీ ఆహ్వానించనున్నట్లు సమాచారం. ప్రజెంట్ ఈ న్యూస్ వైరల్ అవుతుంది.

Actress Hebah Patel Exclusive Interview | The Great Indian Suicide | Filmy Focus Originals

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus