Mahesh Babu: దిల్ రాజు ఎక్కడా తగ్గడం లేదుగా.. పెద్ద స్కెచ్చే ఇది!

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఓ డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన ఆయన ఈరోజు టాలీవుడ్ ను లీడ్ చేసే రేంజ్ కు ఎదిగారు. దిల్ రాజు బ్యానర్లో ఓ సినిమా రూపొందుతోంది అన్నా లేదా.. దిల్ రాజు ప్రత్యేకంగా ఓ సినిమాని రిలీజ్ చేస్తున్నారు అన్నా.. ఆయా సినిమాలకు భారీ క్రేజ్ ఏర్పడుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల వచ్చిన సూపర్ హిట్ చిత్రాలు ‘మసూద’ ‘లవ్ టుడే’.. దిల్ రాజు రిలీజ్ చేసినవే. ఇదిలా ఉంటే 2023 సంక్రాంతికి..

దిల్ రాజు తన సినిమా కోసం ‘వాల్తేరు వీరయ్య’ ‘వీరసింహారెడ్డి’ చిత్రాలకు థియేటర్లు లేకుండా చేస్తున్నారు అంటూ ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. నైజాం ఏరియా మొత్తం ‘వరిసు'(వారసుడు) కి ఎక్కువ థియేటర్లను ఆయన కేటాయించారు. కానీ డబ్బింగ్ సినిమాకి ఆయన అన్ని థియేటర్లు ఎలా ఇస్తారు అనే వాదన కూడా ఉంది. సంక్రాంతి సీజన్లో డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు ఇవ్వడం కుదరదు అని గతంలో ఆయనే చెప్పారు. దిల్ రాజు తాను నిర్మాతగా ఉంటే ఒకమాట,

డిస్ట్రిబ్యూటర్ గా ఉంటే ఇంకో మాట అన్నట్టు వ్యవహరిస్తారు అని ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. కానీ వీటిని దిల్ రాజు పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ‘వరిసు’ ప్రమోషన్స్ ను ఫుల్ స్వింగ్ లో నిర్వహించడానికి దిల్ రాజు ప్రయత్నిస్తున్నారు. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుండి ఆల్రెడీ రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. అవి సూపర్ హిట్ అయ్యాయి. రేపటి నుండి ‘వరిసు’ ప్రమోషన్ల జోరు మరింతగా పెరగనుంది.

అంతేకాదు ప్రీ రిలీజ్ కు గెస్ట్ గా ఎవర్ని తీసుకొచ్చేది కూడా ఫైనల్ అయిపోయింది.అందుతున్న సమాచారం ప్రకారం.. ‘వారసుడు'(వరిసు) ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మహేష్ బాబుని గెస్ట్ గా తీసుకురాబోతున్నారట.దిల్ రాజుకి మహేష్ బాగా క్లోజ్.. దర్శకుడు వంశీ పైడిపల్లి కి మహేష్ మంచి ఫ్రెండ్. ఇక హీరో విజయ్ అంటే కూడా మహేష్ కు చాలా అభిమానం. దీంతో ‘వారసుడు’ మూవీని తెలుగులో మహేష్ ప్రమోట్ చేయడానికి సిద్దపడినట్టు తెలుస్తుంది. అట్లుంటది మరి దిల్ రాజు స్ట్రాటెజీ.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus