“మహర్షి”లో మహేష్ మరో ఇంట్రెస్టింగ్ రోల్..?

‘ఆగడు’ చిత్రం నుండీ ‘భరత్ అనే నేను’ చిత్రం వరకూ మహేష్ బాబు ఒకే లుక్ లో… సెట్టిల్డ్ పెర్ఫార్మన్స్ కి మాత్రమే అంకితమయిపోయాడనే కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. ‘భరత్ అనే నేను’ సక్సెస్ ప్రమోషన్లలో… తెలంగాణా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన ‘కే.టి.ఆర్’ కూడా ఇదే కామెంట్ ను మహేష్ కు డైరెక్ట్ గా తెలిపిన సంగతి తెలిసిందే. అందుకు మహేష్ కూడా తన నెక్స్ట్ సినిమాకి ఓ కొత్త ‘మేక్ ఓవర్’ ట్రై చేస్తునట్టు కూడా సమాధానమిచ్చాడు. ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న ‘మహర్షి’ చిత్రంలో ఇప్పటికే మూడు గెటప్ లలో ఉన్న మహేష్ పిక్స్ విడుదలయ్యాయి. ఇప్పుడు ఈ చిత్రంలో మహేష్ మరో గెటప్ లో కనిపించబోతున్నాడట.

విషయంలోకి వెళితే మహేష్ బాబు ‘మహర్షి’ చిత్రంలో క్రికెటర్ గా కనిపించబోతున్నాడట. బ్యాట్ పట్టుకొని మైదానంలో క్రికెట్ ఆడుతూ ఉండే సన్నివేశాలు ఈ చిత్రంలో ఉన్నాయట.ఇటీవల వీటికి సంబంధించిన సన్నివేశాలను కూడా చిత్రీకరించినట్లు తెలుస్తోంది.ఇప్పటి వరకూ మహేష్ క్రికెట్ బ్యాట్ పట్టుకున్న దృశ్యం ఒక్కటి కూడా లేని క్రమంలో… మహేష్ క్రికెట్ ఆడే సన్నివేశాలు తెరపై అభిమానులను మరింత ఖుషీ చేస్తాయని అంటున్నారు ఫిలింనగర్ విశ్లేషకులు. ‘ఒక్కడు’ చిత్రంలో తప్ప మరే చిత్రంలోనూ మహేష్ క్రీడాదికారుడుగా కనిపించలేదు. మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత ‘మహర్షి’లో క్రికెటర్ గా కనిపించబోతున్నాడు.

అయితే ఈ లుక్ కి సంబంధించిన ఫోటోలు ఇంకా విడుదల చేయనప్పటికీ.. ఈ వార్త బయకొచ్చినప్పటి నుండీ… మహేష్ క్రికెటర్ లుక్ కి సంబంధించి ఒక్క పిక్ అయినా నిర్మాతలు విడుదల చేస్తే బాగుణ్ణు అంటూ… అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తూ .. సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్దే నటిస్తుండగా… అల్లరి నరేష్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్వనీదత్, ప్రసాద్ వి పొట్లూరి కలిసి నిర్మిస్తున్నారు. జగపతి బాబు, సాయి కుమార్, తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 25న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus