Mahesh Babu, Trivikram: మహేష్ త్రివిక్రమ్ ఫ్యాన్స్ కు సర్‌ప్రైజింగ్ న్యూస్!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాల తర్వాత మరో సినిమా తెరకెక్కనుంది. అయితే మహేష్ బాబు సర్జరీ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో మహేష్ బాబు అభిమానులు ఈ సినిమా విషయంలో టెన్షన్ పడుతున్నారు. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో ఎప్పుడు రిలీజవుతుందో మహేష్ ఫ్యాన్స్ కు అర్థం కావడం లేదు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.

ప్రస్తుతం మహేష్ దుబాయ్ లో ఉండగా ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని సమాచారం. మహేష్ హాజరు కాకపోయినా సర్కారు వారి పాట షూటింగ్ జరుగుతోందని జనవరి ఫస్ట్ వీక్ నాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుందని తెలుస్తోంది. త్రివిక్రమ్ ఇప్పటికే మహేష్ సినిమా బౌండ్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారని సమాచారం. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ షూటింగ్ ఆగష్టు నాటికి కేవలం ఆరు నెలల్లో పూర్తి కానుందని వచ్చే ఏడాది దసరాకు ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం.

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టారని తెలుస్తోంది. రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ హీరోగా ఒక సినిమా తెరకెక్కనున్న నేపథ్యంలో త్రివిక్రమ్ మహేష్ సినిమాను వేగంగానే పూర్తి చేయనున్నారని సమాచారం అందుతోంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు దుబాయ్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు. మహేష్ రాజమౌళి కాంబో మూవీ గురించి చాలా సంవత్సరాల నుంచి వార్తలు వస్తుండగా ఎట్టకేలకు ఈ సినిమా మొదలుకానుంది.

ఆఫ్రికా ఫారెస్ట్ అడ్వెంచరస్ బ్యాక్ డ్రాప్ లో మహేష్ రాజమౌళి సినిమా తెరకెక్కనుందని సమాచారం. దాదాపుగా 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేశారని ఆర్ఆర్ఆర్ విడుదలైన తర్వాత జక్కన్న మహేష్ మూవీ కథపై దృష్టి పెట్టనున్నారని బోగట్టా.

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!

Most Recommended Video

మహేష్ టు నవీన్… ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన హీరోల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!
అఘోరా గెటప్‌ టాలీవుడ్‌ హీరోలకు కలిసొచ్చిందా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus