ఈసారి హీరో వంతు!

సాధారణంగా ఓ సినిమా కోసం “హీరోయిన్ ఇన్ని చీరలు కట్టుకొంది, లేదా సినిమా మొత్తానికి ఇన్ని రకాల హెయిర్ స్టైల్స్ చేంజ్ చేసుకొంది” అనే వార్తలు వింటుంటాం. కానీ. “బ్రహ్మోత్సవం” విషయంలో అదంతా రివర్స్ లో జరిగింది.

ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించిన సమంత, కాజల్ లు పాటల సహా సినిమా మొత్తానికి ఓ నలభై లేదా మరీ ఎక్కువ అనుకొంటే ఓ యాభై కాస్ట్యూమ్స్ తో సరిపెట్టుకోగా.. హీరోగా నటించిన మహేష్ బాబు మాత్రం దాదాపుగా 100కు పైగా కాస్ట్యూమ్స్ మార్చాడట.

ఈ విషయాన్ని మహేష్ బాబు స్వయంగా ఇవాళ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.
మరి మహేష్ మార్చిన 100 కాస్ట్యూమ్స్ ఆయన అభిమానులను ఏమేరకు అలరిస్తాయో చూడాలి!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus