Mahesh Babu, Rajamouli: రాజమౌళి సినిమా పనులు మొదలెట్టిన మహేష్‌… ఏం చేస్తున్నాడంటే?

‘గుంటూరు కారం’ వచ్చేసింది… ఆ సినిమా ఊసులు అయిపోయాయి కూడా. దీంతో ఇప్పుడు అటు మహేష్‌బాబు, ఇటు మహేష్‌ ఫ్యాన్స్‌ రాజమౌళి సినిమా గురించే మాట్లాడుతున్నారు. మహేష్‌, రాజమౌళి ఇటీవల సినిమా పనుల్ని సీరియస్‌గా ప్రారంభించాడు అని అంటున్నారు. చాలా ఏళ్లుగా వినిపిస్తున్న ఈ ప్రాజెక్టు గురించి మహేష్‌ నుండి తొలి అడుగు పడింది అని అంటున్నరు. ఈ సినిమా కోసం సూపర్‌ స్టార్‌ జర్మనీ వెళ్లాడని టాక్‌. రాజమౌళి సినిమా అంటే భారీ యాక్షన్‌ సన్నివేశాలు, అంతకుమించిన విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయి.

ఆయన గత చిత్రాలు చూస్తే ఈ విషయంలో మనకు పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు మహేష్‌ సినిమా కోసం కూడా అలాంటి ప్రయత్నాలే జరుగుతున్నాయి. గత కొన్ని నెలలుగా రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా సినిమా రంగ నిపుణులు, సాంకేతిక నిపుణులతో భేటీ అవుతున్నారు. మహేష్‌ సినిమా కోసం అవసరమైన సాంకేతికతను అందిపుచ్చుకునే క్రమంలోనే ఈ భేటీలు జరిగాయని అప్పట్లో అన్నారు. ఈ నేపథ్యంలో మహేష్‌ (Mahesh Babu) జర్మనీలో ప్రత్యేక వైద్య నిపుణుల సమక్షంలో శారీరక శిక్షణ తీసుకుంటున్నారట.

అలాగే విజువల్‌ ఎఫెక్ట్స్‌ విషయంలోనూ ప్రత్యేక సెషన్స్‌ జరుగుతున్నాయట. అయితే శారీరక శిక్షణ విషయంలో మహేశ్‌బాబు సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించాడు. డాక్టర్ హ్యారీ కొనిగ్ జర్మనీలో పాపులర్. బ్రెన్నెర్స్ పార్క్ హోటల్ అండ్ స్పాలో ప్రత్యేక కన్సల్టేషన్లు చేస్తుంటారు. మహేష్ తన బాడీ ఫిట్ నెస్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల కోసం హ్యారీని కలుసుకున్నాడట. మరోవైపు ఈ సినిమాకి టైటిల్‌ ఇంకా ఖరారు కాలేదని…

కథ ఎక్కువగా అడవి నేపథ్యంలో సాగుతుందని కథా రచయిత విజయేంద్ర ప్రసాద్‌ తెలిపారు. ఈ సినిమా పీరియాడికల్‌ కథ కాదని చెప్పిన ఆయన స్క్రిప్టు పూర్తయిందని చెప్పారు. అలాగే మ్యూజికల్‌ డిస్కషన్స్‌ జరుగుతున్నాయని కూడా చెప్పారు. ఇక ఈ ప్రాజెక్టుని ఈ ఏడాది ఉగాది కానుకగా ఏప్రిల్ 9న పూజా కార్యక్రమాలతో లాంచ్ చేయబోతున్నారట. సినిమా కోసం రూ. 1000 కోట్ల నుండి రూ. 1200 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus