Namrata Shirodkar: గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించిన నటి నమ్రత.. వీడియో వైరల్!

Advertisement

పర్యావరణ పరిరక్షణ కోసం ఇప్పటికే ఎంతోమంది మొక్కలను నాటుతూ పర్యావరణాన్ని కాపాడుకునే పనిలోపడ్డారు ఈ క్రమంలోనే పర్యావరణ పరిరక్షణ కోసం రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కు ఎంతో మంచి ఆదరణ వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ గ్రీన్ ఇండియా చాలెంజ్ కు ఎంతో మంచి ఆదరణ కూడా వస్తుంది సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీ వరకు ఈ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలను నాటుతున్న విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను మహేష్ బాబు భార్య నటీ నమ్రత శిరోద్కర్ స్వీకరించారు.ఈ క్రమంలోని ఈమె సోషల్ మీడియా వేదికగా గ్రీన్ ఇండియా చాలెంజ్ గురించి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. ఈ సందర్భంగా నమ్రత సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేస్తూ గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమానికి తనని ఎంపిక చేసినందుకు రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ కి ముందుగా ధన్యవాదాలు తెలియజేశారు.

ఇక మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం కావడంతో ఆ రోజున ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడటం కోసం తమవంతు కృషి చేయాలని ఈ సందర్భంగా ఈమె మహిళలకు సూచనలు చేస్తూ ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలోనే నమ్రత షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక నమృత విషయానికి వస్తే పెళ్లి కాక ముందు సినిమాలలో నటించిన ఈమె మహేష్ బాబుని వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు గుడ్ బై చెబుతూ పూర్తిగా ఇంటికి పరిమితమయ్యారు. ఈ క్రమంలోనేమహేష్ బాబు సినిమా షూటింగులతో బిజీగా ఉండగా ఈమె ఇంటి బాధ్యతలను చక్కబెడుతున్నారు అలాగే మరోవైపు రెస్టారెంట్ బిజినెస్ లోకి కూడా నమ్రత అడుగు పెట్టారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus