Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » మహర్షి చిత్రంతో మహేష్‌ అన్ని రికార్డ్‌లను బ్రేక్‌ చేయాలని కోరుకుంటున్నాను – విక్టరీ వెంకటేష్‌

మహర్షి చిత్రంతో మహేష్‌ అన్ని రికార్డ్‌లను బ్రేక్‌ చేయాలని కోరుకుంటున్నాను – విక్టరీ వెంకటేష్‌

  • May 2, 2019 / 12:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహర్షి చిత్రంతో మహేష్‌ అన్ని రికార్డ్‌లను బ్రేక్‌ చేయాలని కోరుకుంటున్నాను – విక్టరీ వెంకటేష్‌

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా.. సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. వైజయంతి మూవీస్‌, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, పి.వి.పి సినిమా పతాకాలపై హై టెక్నికల్‌ వేల్యూస్‌తో రూపొందిన భారీ చిత్రం ‘మహర్షి’. సూపర్‌స్టార్‌ మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. మహేష్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో అల్లరి నరేష్‌ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని మే 9న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేస్తున్నారు. కాగా, ‘మహర్షి’ గ్రాండ్‌ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ను మే 1న హైదరాబాద్‌ =పీపుల్స్‌ ప్లాజాలో ఘనంగా నిర్వహించారు. దేశం నలుమూలల నుండి వేలాదిగా తరలి వచ్చిన మహేష్‌ అభిమానుల సమక్షంలో ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమంలో ‘మహర్షి ‘థి¸యేట్రికల్‌ ట్రైలర్‌ను విక్టరీ వెంకటేష్‌, కామన్‌ రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ను యూనిట్‌ సభ్యులు విడుదల చేశారు. ఆడియో సీడీలను విక్టరీ వెంకటేష్‌, విజయ్‌దేవరకొండ, కొరటాలశివ సంయుక్తంగా విడుదల చేశారు.

విక్టరీ వెంకటేష్‌ మాట్లాడుతూ – ”మహేష్‌ ప్రపంచాన్నే ఏలేస్తాడమ్మా!. ట్రైలర్‌ చూశారుగా.. అదిరిపోయిందిగా.. మహేష్‌ 25వ మూవీ ఇది. ఆయనకు ఇది 25వ సినిమా అయినా.. ఆయన ఏజ్‌ మాత్రం 25 లాగానే కనపడుతుంది. ప్రతి యాక్టర్‌కు ఒక ఫేవరేట్‌ కెమెరా యాంగిల్‌ ఉంటుంది.తనకి మాత్రం 360 డిగ్రీస్‌ .. ఏ కోణంలో పెట్టినా అందంగానే కనపడతారు. మహేష్‌కి ప్రెస్టీజియస్‌ మూవీ. ఇందులో నటించిన నటీనటులు, టెక్నీషియన్స్‌ సహా నిర్మాతలు దత్తుగారు, దిల్‌రాజు, పిపికి ఆల్‌ ది బెస్ట్‌. డెఫినేెట్‌గా మే 9న మంచి సినిమాను ఇస్తారనే అనుకుంటున్నాను. ఒకప్పుడు చిన్నోడు నాపై కోపంతో పూలకుండీని తన్నాడు. అలా తన్నినప్పుడు ఆ సినిమా ఎన్ని రికార్డ్స్‌ బద్దలు కొట్టిందో తెలుసు. మళ్లీ ఈ సినిమాతో అన్నీ రికార్డులను తన్నేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌” అన్నారు.

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు మాట్లాడుతూ – ”మా అన్నయ్య వెంకటేష్‌గారికి థాంక్స్‌. ఆయన ఎనర్జీ చాలా పాజిటివ్‌గా ఉంటుంది. తెలుగు ఇండస్ట్రీలో ఆయనంత ఎక్కువగా ఎవరినీ ఇష్టపడను. ఆయన ఏ సెట్‌కువెళ్లినా, ఏ ఫంక్షన్‌కు వెళ్లినా అది సూపర్‌హిట్‌ అంటుంటారు. ఆయన మా ఫంక్షన్‌కు రావడం ఆనందంగా ఉంది. గౌరవంగా కూడా భావిస్తున్నాను. యంగర్‌ జనరేషన్‌ హీరోల్లో విజయ్‌ను ఎక్కువగా ఆడ్మైర్‌ చేస్తాను. ‘అర్జున్‌ రెడి’్డ సినిమాలో తన నటన బాగా నచ్చింది. ఈ పాతిక సినిమాల జర్నీలో నేను థాంక్స్‌ చెప్పుకోవాల్సిన డైరెక్టర్స్‌ చాలా మందే ఉన్నారు. ముందుగా రాఘవేంద్రరావుగారికి థాంక్స్‌. ఎందుకంటే ఆయన నన్ను ఇంట్రడ్యూస్‌ చేశారు. ఆయనకు ఎప్పడూ రుణపడి ఉంటాను. అలాగే ‘మురారి’ సినిమా చేసిన క ష్ణవంశీగారికి థాంక్స్‌. నన్ను స్టార్‌ను చేసిన సినిమా ‘ఒక్కడు’ చేసిన గుణశేఖర్‌కి థాంక్స్‌. అలాగే నన్ను ఫ్యామిలీ ఆడియెన్స్‌, యు.ఎస్‌. ఆడియెన్స్‌కు దగ్గర చేసిన సినిమా ‘అతడు’. ఆ సినిమా చేసిన త్రివిక్రమ్‌గారికి థాంక్స్‌. నా లైఫ్‌లో టర్నింగ్‌ పాయింట్‌ అని చెప్పుకోవాలంటే ‘దూకుడు’ సినిమాయే. ఆ సినిమా చేసిన శ్రీనువైట్లగారికి థాంక్స్‌. ‘శ్రీమంతుడు’, ‘భరత్‌ అనే నేను’ సినిమాలతో రెండు సార్లు లైఫ్‌ ఇచ్చిన కొరటాల గారిక థాంక్స్‌. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ 25వ సినిమా వంశీపైడిపల్లి గురించి చెప్పాలంటే నేను ఎవరినీ పేరు పెట్టి పిలవలేదు. వంశీనే అలా పిలుస్తాను. అందుకు కారణం అతన్ని నా తమ్ముడిగా భావిస్తున్నాను. ఈ కథ వినడానికి ముందు పది నిమిషాలు విని పంపించేద్దామనుకున్నాను. అందుకు కారణం ముందుగా ఉన్న కమిట్‌ మెంట్స్‌. టైం ఉండదేమో అనుకున్నాను. అయితే వంశీ 20 నిమిషాల నెరేషన్‌ విన్న తర్వాత .. రెండు సినిమాల తర్వాతే ఈ సినిమా చేయాల్సి వస్తుందని అన్నాను. పర్లేదు సార్‌! నేను వెయిట్‌ చేస్తాను. మిమ్మల్ని తప్ప నేను ఎవరినీ ఊహించలేదని చెప్పాడు. తనకు ఆ విషయంలో నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఏ డైరెక్టర్‌ దగ్గరైనా కథుంటే రెండు నెలలు డిలే అయినా మరో హీరో దగ్గరకు వెళ్లిపోతారు. అలా కాకుండా తను నా కోసం రెండేళ్లు వెయిట్‌ చేశాడు. సినిమాలో ఇంపార్టెంట్‌ రోల్‌ చేసిన అల్లరినరేష్‌గారికి థాంక్స్‌. సినిమాటోగ్రాఫర్‌గారు మోహనన్‌గారికి థాంక్స్‌. రామ్‌ లక్ష్మణ్‌గారు కథను అర్థం చేసుకుని ఫైట్‌ కంపోజ్‌ చేశారు. నా 25వ సినిమాకు రాజు మాస్టర్‌గారికి థాంక్స్‌. ఇక దేవిశ్రీ గురించి చెప్పాలంటే తను నా సినిమాల్లో దేనికైనా ఆర్‌ ఆర్‌ చేస్తున్నాడంటే కంప్లీట్‌గా రిలాక్స్‌ అయిపోతాను. టెన్షన్‌ ఉండదు. తనతో జర్నీ ఇలాగే కొనసాగాలి. నా ముగ్గురు నిర్మాతలు అశ్వినీదత్‌గారు, దిల్‌రాజుగారు, పివిపిగారికి థాంక్స్‌. నాకు చాలా ఇంపార్టెంట్‌ మూవీ. ఏం కావాలో దాన్ని సమకూర్చారు. ఈ 25 సినిమాల జర్నీలో ప్రేక్షకుల చూపించిన అభిమానానికి చెతులెత్తి దండం పెడుతున్నాను. ఈ అభిమానం, ప్రేమ మరో పాతిక సినిమాలు, 20 ఏళ్లు ఉండాలని కోరుకుంటున్నాను” అన్నారు.

క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ – ”నేను ఇంటర్మీడియట్‌ నుండి మహేష్‌బాబుగారికి పెద్ద ఫ్యాన్‌ని. అందుకే ఆయన్ని సార్‌! అని పిలవడానికి కూడా ఇబ్బందిగానే ఉంది. మేం కాలేజ్‌లో ఉన్నప్పుడు మావాడు అని అనుకుంటుండే. ఆయన 25వ సినిమా. ఇదొక జర్నీ. జర్నీ ఆఫ్‌ రిషి.. జర్నీ ఆఫ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు. ఒక్కొక్క జర్నీకి ఒక్కొక్క సూపర్‌స్టార్‌ ఉండేవాళ్లు. ఓ జనరేషన్‌కి చిరుసార్‌ ఉండేవాళ్లు. కోణార్క్‌లో మహేష్‌ బాబు సినిమాలు చూడాలనుకునేవాడిని. కానీ మాస్‌ ఫ్యాన్స్‌ కారణంగా టిక్కెట్స్‌ దొరికేవీ కావు. చివరకు లేడీస్‌ క్యూ తక్కువగా ఉంటుందని తెలుసుకుని సినిమా రిలీజ్‌ సమయంలో నా కజిన్స్‌ని పట్టుకుని టికెట్స్‌ తెప్పించుకునేవాడిని. అలా యాక్టర్‌ అయిన తర్వాత ఓ అవార్డ్‌ ఫంక్షన్‌కి వెళ్లాను. అక్కడకు మహేష్‌గారు రాగానే ఆయన్ను అందరూ విష్‌ చేయడం చూసి అరె! లైఫ్‌ అంటే అలా ఉండ్రాలా అనుకున్నాను. తర్వాత నేను ‘పెళ్ళిచూపులు’, ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాలు చేశాను. వాటిని చూసి మహేష్‌గారు ట్వీట్‌ చేసేవారు. నా ఫోన్‌లో ట్విట్టర్‌ వాట్సాప్‌ ఉండవు కానీ. ఎవరో చెబితే వెళ్లి వెతుక్కునేవాడిని. నా గురించి ఆయన ఏదైనా గొప్పగా చెబితే సంతోషంగా అనిపించేది. ఆయన్ని గర్వంగా ఉంచడానికి కంటిన్యూగా సినిమాలు చేస్తాను. నా గురించి ట్వీట్స్‌ చేసేలా చూసుకుంటాను. నా పుట్టినరోజునే ఈ సినిమా విడుదలవుతుంది. ఓ రకంగా నాకు కూడా ప్రెషర్‌గా అనిపిస్తోంది. ఈ సినిమా సూపర్‌డూపర్‌హిట్‌ కావాలి. వంశీ అన్న నాకు గైడెన్స్‌ ఇస్తుంటారు. ఎంటైర్‌ యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌. మే 9న ఓ సూపర్‌హిట్‌ చూడాలని ఓ ఫ్యాన్‌గా, ఓ యాక్టర్‌గా ఎదురుచూస్తున్నాను” అన్నారు.

మెగా ప్రొడ్యూసర్‌ సి.అశ్వినీదత్‌ మాట్లాడుతూ – ”సూపర్‌స్టార్‌ క ష్ణ, మహేష్‌ అభిమానులకు థాంక్స్‌. ‘అగ్ని పర్వతం’ చిత్రం నుండి ఘట్టమనేని కుటుంబంతో ఎన్నో గొప్ప చిత్రాలు తీశాను. అలాగే ‘రాజకుమారుడు’ చిత్రంలో మహేష్‌ను ప్రిన్స్‌గా హీరోగా ప్రేక్షకులకు పరిచయం చేశాను. ఈరోజు ఆయన 25వ చిత్రాన్ని మేం ముగ్గురం కలిసి నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. మే 9న గతంలో మా బేనర్లో ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, ‘మహానటి’ సినిమాలు విడుదలయ్యాయి. గతంలో నా సహచర నిర్మాతలు అల్లు అరవింద్‌గారితో, రాఘవేంద్రరావుగారితో కలిసి సినిమాలు చేశాను. ఈ తరంలో యంగ్‌ అండ్‌ డైనమిక్‌ టాలెంటెడ్‌ ప్రొడ్యూసర్స్‌ అయిన దిల్‌రాజు, పివిపిగారితో కలిసి పనిచేయడం గర్వంగా ఉంది. ఈ సినిమా అన్నీ రికార్డ్స్‌ను క్రాస్‌ చేస్తుంది” అన్నారు.

హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ – ”సూపర్‌స్టార్‌ అభిమానులకు ఈసినిమా ఎంత పెద్ద హిట్‌ కావాలని ఉందో అంత పెద్ద కోరిక మే 9న తీరబోతుంది. మహేష్‌గారి 25వ చిత్రాన్ని మూడు బ్యానర్స్‌ కలిపి చేశాం. మే 9న అద్భుతమైన సినిమా ఇస్తున్నామని నమ్మకంతో ఉన్నాం. ట్రైలర్‌ చూసిన తర్వాత అందరూ బ్లాక్‌ బస్టర్‌ కొట్టారని మెసేజ్‌లు వస్తున్నాయి. ఒక్కొక్క టెక్నీషియన్‌తో వంశీగారు చేసిన ట్రావెల్‌ గొప్పది. సినిమాటోగ్రాఫర్‌ మోహనన్‌గారికి థాంక్స్‌. దేవిశ్రీ గురించి చెప్పాలంటే ఈ సినిమా కోసం ఏడాదిన్నరగా ట్రావెల్‌ చేస్తున్నాడు. సాధారణంగా ఆరు పాటలుంటాయి. కానీ ఈ సినిమాలో రెండు డ్యూయెట్స్‌ నాలుగు మాంటేజ్‌ సాంగ్‌లుంటాయి. అంటే ఎంత పెద్ద కథో అర్థం చేసుకోవచ్చు. రేపు సినిమా చూసేటప్పుడు విజువల్స్‌ను ఎంజాయ్‌ చేస్తారు. రేపు థియేటర్స్‌లో ఆల్బమ్‌ మారుమ్రోగిపోతుంది. అది మా గ్యారంటీ. వంశీ, హరి, సాల్మన్‌ కారణంగానే ఈ కథ పుట్టింది. వంశీ పక్కనే వాళ్లు ఉండి ఎంతగానో సపోర్ట్‌ అందించారు. రేపు సినిమా రిలీజ్‌ తర్వాత అందరూ కాలర్‌ ఎగరేసుకుని బయటకు వస్తారు. అల్లరి నరేష్‌గారికి క్యారెక్టర్‌ అద్భుతంగా ఉంటుంది. వంశీ ఏడాదిన్నర పాటు మహేష్‌గారితో ట్రావెల్‌ అయ్యి ఈ సినిమా చేశాడు. వంశీకెరీర్‌కే మైలురాయిలాంటి సినిమా. మొన్న సినిమా చూపించాడు. సినిమా చూసే సమయంలో ఓ దణ్ణం పెట్టేసే దాన్ని వాట్సాప్‌లో పంపేశాను. ఇక క్లైమాక్స్‌ చూడగానే.. కంట్రోల్‌ చేసుకోలేకపోయాను. ఒక సినిమా జర్నీలో ఎందరినో కలుస్తాం. ఆ జర్నీలో అందరికీ ఓ అద్భుతమైన ట్రావెల్‌ ఉంటుంది. దత్తుగారు, పివిపిగారితో కలిసి పనిచేయడం గొప్ప అవకాశం. మే 9న ..రాసి పెట్టుకోండి.. మహేష్‌ అభిమానులుగా సినిమా ఎంత పెద్ద హిట్‌ కావాలో కోరుకోండి. సినిమా అంత పెద్ద హిట్‌ అవుతుంది” అన్నారు.

నిర్మాత పివిపి మాట్లాడుతూ – ”మహేష్‌గారికి థాంక్స్‌. నాకు, దత్తుగారు, రాజుగారికి ఇదొక మెమొరబుల్‌ మూవీ. ‘ఊపిరి’ తర్వాత మహేష్‌గారు వంశీకి ఫోన్‌ చేసి అభినందించారు. తర్వాత మరో రెండు రోజులకు నేను మహేష్‌గారికి ఫోన్‌ చేశాను. ఈ సినిమా లైన్‌ వినగానే సినిమా చేద్దామని అన్నారు. మూడేళ్లు గడిచిపోయింది. మే 18న ఈ సినిమా సక్సెస్‌ మీట్‌ను విజయవాడలో నిర్వహించాలనుకుంటున్నాం” అన్నారు.

సుధీర్‌బాబు మాట్లాడుతూ – ”ఈ సినిమాకు పనిచేసిన అందరితో నాకు మంచి పరిచయం ఉంది. దిల్‌రాజుగారి తొలి సినిమాను నేనే డిస్ట్రిబ్యూట్‌ చేశాను. అశ్వినీదత్‌గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్‌. పివిపిగారు నేను బ్యాడ్మింటన్‌ ఆడేటప్పటి నుండి పరిచయం ఉంది. ఇక వంశీ పైడిపల్లి నేను చెడ్డి దోస్తులం. ఒకే రూంలో కలిసి ఉన్నాం. ఎలాగైతే ఓ పండుగాడు, మురారి, అజయ్‌, హర్ష తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిలిచిపోయాయో.. అలాగే రిషి క్యారెక్టర్‌ కూడా నిలిచిపోతుందని భావిస్తున్నాను” అన్నారు.

అల్లరి నరేష్‌ మాట్లాడుతూ – ”మహేష్‌బాబుగారి ప్రెస్టీజియస్‌ 25వ చిత్రంలో నేను కూడా నటించడం ఆనందంగా ఉంది. దత్తుగారు, దిల్‌రాజుగారు, పివిపిగారికి థాంక్స్‌. ఈ చిత్రం మెగా బ్లాక్‌ బస్టర్‌ అవుతుంది. మహేష్‌గారికి, వంశీగారు నాలో కామెడీ యాంగిల్‌లోనే కాదు..సీరియస్‌ యాంగిల్‌ను కూడా చూసి మంచి అవకాశం ఇచ్చినందుకు థాంక్స్‌” అన్నారు.

చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ – ”హైదరాబాద్‌లో పుట్టి పెరిగి టికెట్స్‌ కోసం ఆర్‌.టి.సి క్రాస్‌రోడ్స్‌లో దెబ్బలు తిని సినిమాలు చూసి హీరో ఇంట్రడక్షన్‌కి పేపర్స్‌ విసిరిని వాళ్లలో నేను ఒకడిని. ఒక ఆడియెన్‌ టికెట్‌ కొన్నప్పుడు ఏం కోరుకుంటారో నాకు తెలుసు. ఓ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుగారి ఫోటో ఉంటే సినిమాలో ఏం ఉండాలని కోరుకుంటారో నాకు తెలుసు. ‘ఒక్కడు’ సినిమా నా ముందు మహేష్‌గారు సినిమా చూస్తున్నారు. ఈరోజు ఆయన్ని డైరెక్ట్‌ చేయడమే ఓ జర్నీ. గతంలో నేను ఎక్కడున్నా.. ఇప్పుడు ఎక్కడున్నాననేదే జర్నీ. ఈ జర్నీలో నాకు సపోర్ట్‌ చేసిన అందరికీ చేతులెత్తి దణ్ణం పెడుతున్నాను. ఈ కథకు సంబంధించి హరి, సాల్మన్‌ ఎప్పుడో బీజం వేశారు. ‘ఊపిరి’ చేసేటప్పుడు వాళ్లు చెప్పిన క్యారెక్టర్‌ ఎందుకో నాకు బాగా ఎక్కేసింది. తర్వాత నేను హరి, సాల్మన్‌గారు కలసి కథను తయారు చేశాం. హరిగారు నాకు దేవుడిచ్చిన సోదరుడు. పర్సనల్‌గా, ప్రొఫెషపనల్‌గా నా చెయ్యి పట్టుకుని నడిపించారు. మోహనన్‌గారు షారూక్‌తో ‘డాన్‌’ సినిమా చేశారు. తర్వాత అమీర్‌తో ‘తలాష్‌ ‘చేశారు. మొన్న అంధాదున్‌ చేశారు. అలాంటి సెలబ్రిటీ సినిమాటోగ్రాఫర్‌తో ఈ సినిమాకు పనిచేశాను. ఆయన ఈ సినిమాకు ఏంజెల్‌. ఆయన అందించిన సపోర్ట్‌కి థాంక్స్‌. శ్రీమణి చాలా డెప్త్‌తో పాటలు రాశారు. సినిమాలో ఓ సర్‌ప్రైజ్‌ సాంగ్‌ త్వరలోనే రిలీజ్‌ చేయబోతున్నాం. దేవిశ్రీప్రసాద్‌ ఈ సినిమాకు బిగ్గెస్ట్‌ స్ట్రెంగ్త్‌గా నిలిచారు. 16 ఏళ్ల క్రితం ‘వర్షం’ సినిమాకు నేను అసిస్టెంట్‌గా పనిచేస్తున్నప్పుడు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే ఇక్కడి వరకు వచ్చింది. ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్‌ అందించారు. నిర్మాతలు దిల్‌రాజుగారికి, దత్తుగారికి, పివిపి అన్నకు థాంక్స్‌. మే 9న ఎప్పుడో ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమా చూసి.. సినిమా అంటే పిచ్చి పుట్టింది.మళ్లీ మే 9న ‘మహర్షి’ ప్రేక్షకుల ముందుకు రానుంది. సూపర్‌స్టార్‌ మహేష్‌ ఫ్యాన్స్‌ గుర్తు పెట్టుకునే రోజుగా మే 9 నిలవనుంది. సినిమా కోసం మేం పడ్డ కష్టంపై నమ్మకంతో చెబుతున్న మాట ఇది. దిల్‌రాజుగారు, శిరీష్‌గారు, లక్ష్మణ్‌గారు నాకు ఫ్యామిలీ మెంబర్స్‌తో సమానం. నరేష్‌గారు తన నటనతో నేను రాసుకున్న పాత్రకు ప్రాణం పోశారు. అలాగే పూజా హెగ్డేకు థాంక్స్‌. మే 9న సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు ఫ్యాన్స్‌ కాలర్‌ ఎత్తుకుని తిరిగే రోజని చెబుతున్నాను. ఈ సినిమా చేసే సమయంలో ఆయన అందించిన సపోర్ట్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన స్టార్‌గానే సూపర్‌స్టార్‌ కాదు.. హ్యుమన్‌ బీయింగ్‌గా కూడా సూపర్‌స్టారే. నేను ఎప్పుడైనా ప్రెషర్‌ ఫీలయితే ఆయన నా పక్కన కూర్చుని ధైర్యం చెప్పారు. ఆయనతో పనిచేయడం ఆనందంగా ఉంది. ఆయనతో మంచి స్నేహితుడ్ని, సోల్‌మేట్‌ను చూసుకున్నాను. నేను కథ చెప్పే రోజునే మీ కెరీర్‌లో వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ మూవీస్‌ అవుతుందని చెప్పాను. ఇప్పుడు అభిమానుల సమక్షంలో ప్రామిస్‌ చేస్తున్నాను. ఈ జర్నీలో కామాస్‌ ఉంటాయే కానీ.. ఫుల్‌స్టాప్స్‌ ఉండవని మెసేజ్‌ పెట్టారు. అది నిజం. ఇదొక కామా మాత్రమే. ఆయన అందించిన సపోర్ట్‌కి థాంక్స్‌” అన్నారు.

రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ మాట్లాడుతూ – ”చాలా హ్యాపీగా, ఎగ్జయిటెడ్‌గా ఉన్నాను. ఈ సినిమాలో భాగం కావడంతో గర్వంగా ఉంది. దిల్‌రాజుగారికి, పివిపిగారికి, దత్తుగారికి థాంక్స్‌. ఇక మహేష్‌గారితో పని చేయడం ఎప్పటికీ హ్యాపీనే. ఎందుకంటే ఆయన సినిమాల్లో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో పాటు సోషల్‌ రెస్పాన్సిబిలీ కూడా ఉంటుంది. ఇలాంటి అవకాశం రావడం సంతోషంగా ఉంది. గ్రేట్‌ జర్నీ. మహేష్‌గారు ఆయనతో పనిచేసే ప్రతి ఒక్కరికీ గౌరవం ఇస్తారు. కథ వినగానే చాలా సందర్భాల్లో కన్నీళ్లు పెట్టుకున్నాను. సినిమా అంతా ఒక ఎత్తు అయితే.. సినిమా క్లైమాక్స్‌ మరో ఎత్తు. క్లైమాక్స్‌ చూసి కన్నీళ్లు పెట్టుకోని వారుండరు. బ్యాగ్రౌండ్‌ స్కోర్‌లో సినిమా చూసి ఎమోషనల్‌ అయ్యాను” అన్నారు.

నిర్మాత అనీల్‌ సుంకర మాట్లాడుతూ – ”మహర్షి.. మహేష్‌గారి 25వ సినిమాటైటిల్‌లోనే ఓ వైబ్రేషన్స్‌ ఉంది. పాత వంశీగారి సినిమాలో ఓ సాంగ్‌ ఉంటుంది. సాహసం నా పదం రాజసం నా రథం సాగితే ఆపడం సాధ్యమా? అని. ఆ రధాన్ని ఆపడం ఎవరి తరం కాదు. మే 9న అదెలా ఉంటుందో చూడబోతున్నాం” అన్నారు.

దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ – ”మహేష్‌గారి 25వ సినిమాను ప్రొడ్యూస్‌ చేసిన దత్తుగారికి, దిల్‌రాజుగారికి, పివిపిగారికి అభినందనలు. ప్రొడ్యూసర్స్‌కి, మహేష్‌గారికి ఇదొక మెమొరబుల్‌ మూవీగా నిలిచిపోవాలని కోరుకుంటున్నాను. వంశీ పైడిపల్లి ఓ ల్యాండ్‌ మార్క్‌ మూవీ చేసే అవకాశం రావడం అద ష్టం. అలాగే ఓ రెస్పాన్సిబిలిటీ అని కూడా తెలుసు. అంత రెస్పాన్సిబిలిటీతో ఇంత పెద్ద సినిమా చేయడం చాలా గొప్ప విషయం. ట్రైలర్‌ మైండ్‌ బ్లోయింగ్‌గా ఉంది. ఇన్ని ఎమోషన్స్‌, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌, కథ ఉన్న సినిమాకు కథ రాయడం ఎంత కష్టమో నాకు తెలుసు. మహేష్‌గారి ఫ్యాన్స్‌ను శాటిస్ఫై చేయడం అంత ఆషామాషీ కాదు. ఈ చిత్రం ఆయన కెరీర్‌లో వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌గా కాదు.. ది బెస్ట్‌గా మిగిలిపోవాలని కోరుకుంటున్నాను. పూజా, నరేష్‌, దేవిశ్రీప్రసాద్‌ సహా అందరికీ ఆల్‌ ది బెస్ట్‌” అన్నారు.

దర్శకుడు అనీల్‌ రావిపూడి మాట్లాడుతూ – ”నిర్మాతలు దిల్‌రాజు, అశ్వినీదత్‌, పివిపిగారికి అబినందనలు. వంశీ పైడిపల్లిగారితో ‘ఊపిరి’ సినిమాకు డ్రాఫ్ట్‌ కోసం పనిచేశాను. 10 రోజుల ఆయనతో పనిచేసిన తర్వాత ఆయనెంత ప్యాషనేటో అర్థమైంది. ఈ ‘మహరి’్ష సినిమా కోసం ఆయనెంత లైఫ్‌ పెట్టి పనిచేశారో నాకు తెలుసు. రిషి అనే క్యారెక్టర్‌తో చేసిన ఈ సినిమా ఆయన కెరీర్‌లో ల్యాండ్‌ మార్క్‌ మూవీ కావాలని కోరుకుంటున్నాను. మహేష్‌గారు స్టార్‌గానే కాదు.. వ్యక్తిత్వంలో కూడా సూపర్‌స్టారే అని అర్థమైంది. ఆయనతో పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. 25వ చిత్రం ఆయన కెరీర్‌లో ల్యాండ్‌ మార్క్‌ మూవీ కావాలని కోరుకుంటున్నాను” అన్నారు.

నటుడు పోసాని క ష్ణమురళి మాట్లాడుతూ – ”నేను క ష్ణగారికి అభిమానిని. అలాగే ఆయన తనయుడు మహేష్‌గారితో కలిసి ‘భరత్‌ అనే నేను’ చిత్రంలో వర్క్‌ చేశాను. ఇప్పుడు ‘మహర్షి’ సినిమాలో ఆయనతో కలిసి నటించాను. తర్వాత సినిమాలో కూడా మంచి పాత్రలో నటించబోతున్నాను. ఒకప్పుడు తెలుగుసినిమా ఇండస్ట్రీలో మంచి మంచి నిర్మాతలు ఉండేవారు. రామానాయుడుగారు ఉన్నంత కాలం వాళ్ల బ్యానర్‌లో ఎంతో మంది నటీనటులు, సాంకేతిక నిపుణులను పరిచయం చేసి సినిమా ఇండస్ట్రీకి ఎంతో సేవ చేశారు. తర్వాత త్రివిక్రమరావుగారు, అశ్వినీదత్‌గారు,.. ఇలా పెద్ద పెద్ద నిర్మాతలందరూ సినీ ఇండస్ట్రీకి ఎంతో సేవ చేశారు. ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దిల్‌రాజు, వాళ్ల బ్రదర్‌ శిరీష్‌ గురించి మంచి కథతో వస్తే కొత్త దర్శకులతో సినిమాలు చేసి ఎంతో మంది దర్శకులను వెలుగులోకి తెచ్చిన నిర్మాణ సంస్థ దిల్‌రాజుగారి బ్యానర్‌. తెలుగు సినిమా పరిశ్రమ ఉన్నంత కాలం ఈ దిల్‌రాజుగారి సేవలు ఇండస్ట్రీకి కావాలని కోరుకుంటున్నాను” అన్నారు.

నటుడు రాజీవ్‌ కనకాల మాట్లాడుతూ – ”ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకుడు వంశీ పైడిపల్లికి థాంక్స్‌. అలాగే అగ్ర నిర్మాతలు దిల్‌రాజు, అశ్వినీదత్‌, పివిపిగారు కలిసి చేసిన సినిమా ఇది. మే 9న అందరూ మహేష్‌బాబుగారి మేనియాలో ఉంటారు. చాలా కాలం తర్వాత ఆయనతో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నాను. మంచి ఇంట్రెస్టింగ్‌ క్యారెక్టర్‌. ఈ సినిమాలోని నటీనటులు, సాంకేతిక నిపుణులకు థాంక్స్‌” అన్నారు.

హరి మాట్లాడుతూ – ”మూడు సంవత్సరాల పాటు ఈ సినిమా కోసం అందరం ట్రావెల్‌ చేశాం. రేపు 9న అందరూ జాయిన్‌ అవుతారు. దర్శకుడు వంశీగారికి ఇది మంచి సక్సెస్‌ఫుల్‌ సినిమా అవుతుందని కోరుకుంటున్నాను. థాంక్యూ వెరీ మచ్‌” అన్నారు.

లిరిసిస్ట్‌ శ్రీమణి మాట్లాడుతూ – ”మహేష్‌గారి సినిమాలో సింగిల్‌ కార్డ్‌ రాయడం చాలా హ్యాపీగా ఉంది. నా లైఫ్‌లో గ్రేటెస్ట్‌ మూమెంట్‌. వంశీగారికి, దిల్‌రాజుగారికి, దేవిశ్రీ ప్రసాద్‌గారికి థాంక్స్‌” అన్నారు.
సినిమాటోగ్రాఫర్‌ కె.యు.మోహనన్‌ మాట్లాడుతూ – ”వండర్‌ టీంతో ఏడాదికి పైగా నేను చేసిన ప్రయాణమే ఈ చిత్రం. వంశీ పైడిపల్లి సహా నిర్మాతలు సూపర్‌స్టార్‌ మహేష్‌ నుండి కావాల్సిన సహకారాన్ని అందుకున్నాను” అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Maharshi Movie
  • #Maharshi Movie Release
  • #Maharshi Release Date
  • #Mahesh Babu will break all records with this film : venkatesh
  • #Mahesh's Maharshi Movie

Also Read

Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

Aranya Dhara Trailer: ఆకట్టుకుంటున్న ‘అరణ్య ధార’ ట్రైలర్

Aranya Dhara Trailer: ఆకట్టుకుంటున్న ‘అరణ్య ధార’ ట్రైలర్

అస్లీల చిత్రాలు… నటి పై పోలీస్ కేసు..!

అస్లీల చిత్రాలు… నటి పై పోలీస్ కేసు..!

related news

Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

హీరో విజయ్ సేతుపతి చేతుల మీదుగా “ప్రేమిస్తున్నా” చిత్రం నుండి “ఎవరే నువ్వు” సాంగ్ విడుదల!!!

హీరో విజయ్ సేతుపతి చేతుల మీదుగా “ప్రేమిస్తున్నా” చిత్రం నుండి “ఎవరే నువ్వు” సాంగ్ విడుదల!!!

Aranya Dhara Trailer: ఆకట్టుకుంటున్న ‘అరణ్య ధార’ ట్రైలర్

Aranya Dhara Trailer: ఆకట్టుకుంటున్న ‘అరణ్య ధార’ ట్రైలర్

trending news

Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

12 hours ago
Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

12 hours ago
Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

12 hours ago
Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Aranya Dhara Trailer: ఆకట్టుకుంటున్న ‘అరణ్య ధార’ ట్రైలర్

Aranya Dhara Trailer: ఆకట్టుకుంటున్న ‘అరణ్య ధార’ ట్రైలర్

15 hours ago

latest news

Coolie: ‘కూలీ’ లో మరో ఇద్దరు హీరోలు..?

Coolie: ‘కూలీ’ లో మరో ఇద్దరు హీరోలు..?

18 hours ago
Tollywood: కొత్త వీక్‌ వస్తే.. ‘వీక్‌’ అవుతున్న టాలీవుడ్‌.. గతకొన్నేళ్లుగా ఇదే ఇబ్బంది!

Tollywood: కొత్త వీక్‌ వస్తే.. ‘వీక్‌’ అవుతున్న టాలీవుడ్‌.. గతకొన్నేళ్లుగా ఇదే ఇబ్బంది!

19 hours ago
Sangeetha Krish: విడాకుల బాటలో సీనియర్ హీరోయిన్..?

Sangeetha Krish: విడాకుల బాటలో సీనియర్ హీరోయిన్..?

19 hours ago
Deva Katta: ‘మయసభ’ వెబ్‌ సిరీస్‌.. దేవా కట్టా బ్యాలెన్సింగ్‌ భలే చేశారు.. లేకుంటేనా?

Deva Katta: ‘మయసభ’ వెబ్‌ సిరీస్‌.. దేవా కట్టా బ్యాలెన్సింగ్‌ భలే చేశారు.. లేకుంటేనా?

21 hours ago
Mrunal Thakur: ధనుష్ ఫ్యామిలీని కలిసిన మృణాల్.. అసలేం జరుగుతుంది?

Mrunal Thakur: ధనుష్ ఫ్యామిలీని కలిసిన మృణాల్.. అసలేం జరుగుతుంది?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version